Viper Poison: కరోనాకు మందు..ఆ ప్రమాదకర పాము విషమే

Viper Poison: కరోనా మహమ్మారి నియంత్రణకై మందు కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాల్ని తీసే ప్రమాదకర పాము విషంతోనే ప్రాణాల్ని కాపాడవచ్చనే విషయం ఆసక్తి రేపుతోంది. ఆ పరిశోధన వివరాలేంటో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 1, 2021, 01:18 PM IST
Viper Poison: కరోనాకు మందు..ఆ ప్రమాదకర పాము విషమే

Viper Poison: కరోనా మహమ్మారి నియంత్రణకై మందు కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాల్ని తీసే ప్రమాదకర పాము విషంతోనే ప్రాణాల్ని కాపాడవచ్చనే విషయం ఆసక్తి రేపుతోంది. ఆ పరిశోధన వివరాలేంటో చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారికి(Coronavirus)మందు కోసం వివిధ రకాల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా..ఇక మందు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రాణాల్ని హరించే ప్రమాదకర పాము విషమే కరోనాకు మందుగా మారుతుందనే ప్రయోగం ఆసక్తి రేపుతోంది. బ్రెజిల్‌లోని సావోపాలో యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించిన ఈ విషయం మాలిక్యూల్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. 

బ్రెజిల్‌లో కన్పించే ఓ రకమైన రక్తపింజరి పాము(Brazilian Viper Snake) విషం..కరోనా చికిత్సలో ఉపయోగపడే అవకాశముందని బ్రెజిల్‌లోని(Brazil) సావోపాలో యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. ఈ పాము విషంలోని ఓ పదార్ధం వైరస్ పునరుత్పత్తిని కోతిలో సమర్ధవంతంగా అడ్డుకుందని గుర్తించారు. దాదాపు 75 శాతం వరకూ వైరస్ పునరుత్పత్తి నిలిచిపోయిందని స్పష్టం చేశారు. వైపర్ విషయంలోని పెప్టైడ్(Peptide)..కరోనా వైరస్ పునరుత్పత్తిలో కీలకపాత్ర పోషించే పీఎల్‌ప్రో అనే ఎంజైమ్‌కు(PL Pro Enzyme) అనుసంధానంగా ఉందని పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో ఇతర కణాల్ని ఈ పెప్టైడ్ హాని చేయడం లేదని తెలిపారు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న ఈ పెప్టైడ్‌ను ప్రయోగశాలల్లోనూ ఉత్పత్తి చేయవచ్చని..పాముల్ని హింసించాల్సిన అవసరం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. అయితే ఎంత డోసులో ఇస్తే ఆ పదార్ధం ప్రభావవంతంగా పనిచేస్తుందనేది గుర్తించేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. మరోవైపు వైపర్ పాములోని విషంలో ఉండే ఈ పదార్ధానికి కరోనా వైరస్ కణాల్లో ప్రవేశించకుండా తొలిదశలోనే అడ్డుకునే సామర్ధ్యం ఉందా లేదా అనేది తేల్చనున్నారు. ఈ పాము బ్రెజిల్‌లో కన్పించే అతిపెద్ద సర్పాల్లో ఒకటి. 2 మీటర్ల వరకూ పొడుగుంటుంది. బ్రెజిల్‌తో పాటు బొలీవియా, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లో కూడా ఈ రకం పాములు కన్పిస్తుంటాయి.

Also read: Corona New Variant: ప్రపంచానికి సవాలు విసరనున్న కొత్త వేరియంట్, వ్యాక్సిన్ సైతం పనిచేయదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News