5Kg Weight Loss In 1 Month: సింపుల్‌గా ఉదయాన్నే ఇవి తింటూ 5KGల బరువు తగ్గేయండి!

5Kg Weight Loss In 1 Month: అధిక బరువు పెరగడం అనేది ఎంతో చిన్న సమస్య అయినప్పటికీ పెద్దపెద్ద దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య బారిన పడినవారు ఎంత సులభంగా విముక్తి పొందితే అంత మంచిది. సులభంగా బరువు తగ్గడానికి ఉదయాన్నే అల్పాహారంలో ఈ ఆహారాలను తీసుకోండి.

Written by - Shashi Maheshwarapu | Last Updated : Apr 21, 2024, 09:33 PM IST
5Kg Weight Loss In 1 Month: సింపుల్‌గా ఉదయాన్నే ఇవి తింటూ 5KGల బరువు తగ్గేయండి!

 

5Kg Weight Loss In 1 Month In Telugu: అధిక బరువు ఉండడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడడమే, కాకుండా శరీర ఆకృతి కూడా కోల్పోతారు అంతేకాకుండా కొంతమంది అయితే ఏదో కోల్పోయినట్లు దిగులుగా ఉంటారు. ఆధునిక జీవన శైలిలో ఉద్యోగాల ఒత్తిడి కారణంగా అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల సులభంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఈ పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చాలామంది విపరీతమైన కష్టాలు పడుతున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. నిజానికి బరువు పెరగడం సులభమైనప్పటికీ తగ్గడం మాత్రం చాలా కష్టం. కాబట్టి ఈ పెరిగిన బరువును కొంచెం కొంచెంగా తగ్గడం చాలా మంచిది. చాలామంది వెయిట్ లాస్ అయ్యే క్రమంలో ఏవో పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటికి బదులుగా ప్రతిరోజు ఏం చక్కగా వ్యాయామాలు చేస్తూ.. ఆహారపు డైట్లు పాటించడం చాలా మంచిది. 

బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా డైట్ లో భాగంగా అవోకాడోను తప్పకుండా తీసుకోవాల్సిన ఉంటుంది. 2021 సంవత్సరంలో క్లినికల్ అధ్యయనాల్లో తెలిపిన వివరాల ప్రకారం ఈ అవోకాడోను తినేవారిలో సులభంగా క్యాలరీలు బర్న్‌ అవుతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. అలాగే డైట్‌లో భాగంగా తప్పకుండా ప్రోటీన్లు అధికమోతాదులో లభించే కోడిగుడ్లను తీసుకోవాల్సి ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల వ్యాయామాలు చేసే క్రమంలో శరీరానికి శక్తినిచ్చేందుకు ఎంతగానో సహాయపడతాయి.

చాలామందికి వైద్యులు తప్పకుండా ప్రతిరోజు ఒక్కటైనా యాపిల్‌ను తినమని సూచిస్తారు. ఎందుకంటే ఇందులో అధిక మోతాదులో పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని తినడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు లభించడమే, కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా అల్పాహారంలో భాగంగా యాపిల్స్‌ను సలాడ్స్ రూపంలో తీసుకుంటే సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చు. శరీర బరువు తగ్గడానికి తృణధాన్యాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇది బరువును తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి. 

ఎంతో సులభంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు క్లినికల్ పరిశోధనలో సూచించినట్లు ప్రతిరోజు తృణధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్ లేదా రోటీలను తీసుకోవడం చాలా మంచిది. దీంతోపాటు శరీర బరువును తగ్గించేందుకు సీ ఫుడ్స్ కూడా ప్రభావంతంగా సహాయపడతాయి. కాబట్టి వేగంగా బరువు తగ్గాలంటే వ్యక్తులు తప్పకుండా అల్పాహారంలో భాగంగా సీ ఫుడ్స్‌తో తయారు చేసిన సలాడ్స్ తీసుకుంటే ఎంతో మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు చియా విత్తనాలతో తయారుచేసిన డ్రింక్ కూడా మీ శరీర బరువును కలిగించేందుకు ప్రభావంవంతంగా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గే క్రమంలో ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం, చియా విత్తనాలు వేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది.

నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఆరోగ్య నిపుణులు వివరించినవే కాబట్టి వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణులను అడిగి తెలుసుకోవడం ఎంతో మంచిది అలాగే దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించదు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News