Victory venkatesh naarappa first look : విక్టరీ వెంకటేష్ 'నారప్ప' ఫస్ట్‌లుక్

'వెంకీ మామ'తో సూపర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నారప్ప'. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.  తమిళంలో హీరో ధనుష్ నటించిన  చిత్రం  అసురన్ కు ఇది  తెలుగులో రీమేక్ గా వస్తోంది.

Last Updated : Jan 22, 2020, 09:23 AM IST
Victory venkatesh naarappa first look : విక్టరీ వెంకటేష్ 'నారప్ప' ఫస్ట్‌లుక్

'వెంకీ మామ'తో సూపర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నారప్ప'. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.  తమిళంలో హీరో ధనుష్ నటించిన  చిత్రం  'అసురన్'‌కు ఇది  తెలుగులో రీమేక్‌గా వస్తోంది.  ఈ చిత్రానికి 'నారప్ప' అనే టైటిల్‌ ఖరారు చేశారు.  ఫస్ట్ లుక్ పోస్టర్స్‌లో విక్టరీ వెంకటేష్ సీరియస్‌గా కనిపిస్తున్నారు. యాంగ్రీమాన్‌గా కనిపిస్తున్న వెంకటేష్ .. ఈ సినిమాలోనూ వైవిధ్యభరిత పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.     

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో  'నారప్ప'
'నారప్ప' సినిమాకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ చేస్తున్నారు. గతంలో బ్రహ్మోత్సం చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడంతో .. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఐతే వీటన్నింటికీ ..  హీరో విక్టరీ వెంకటేష్ .. ఫస్ట్ లుక్ పోస్టర్లతో సమాధానం చెప్పినట్లుగా అనిపిస్తోంది. ఈ సినిమాను కలైపులి ఎస్. థానుతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.  తాజాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్లాన్ చేశారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది.

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News