Today Petrol Diesel Price in India: భారతదేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు రోజురోజుకు మారుతూ ఉంటాయి. ఏ రోజుకు ఆ రోజు ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు ఉదయం వెల్లడిస్తుంది. అయితే ఇంటర్నేషనల్ ముడి చమురు ధరలను దృష్టిలో పెట్టుకుని భారత్ రోజు ధరలు నిర్ణయమవుతాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి ఏదో ఒక కారణం చేత క్రూడ్ ఆయిల్ ధరలలో తీవ్ర మార్పులు జరుగుతున్నాయి. రోజురోజుకు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ రోజు క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. WTI క్రూడ్ ఆయిల్ 0.11 శాతం పెరుగుదలతో బ్యారెల్‌కు 80.70 వద్ద ముగిసింది. ఇక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ విషయానికొస్తే..బ్యారెల్‌కు 0.15 శాతం లాభంతో $ 85.12 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. కాబట్టి ఈ మార్పుల కారణంగా చాలా నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు:
ఢిల్లీ దగ్గరలో ఉన్న నోయిడాలో పెట్రోల్ 17 పైసలు, డీజిల్ 17 పైసలు తగ్గాయి. దీంతో లీటరుకు పెట్రోల్ రూ.96.59, డీజిల్ రూ.89.76 లభిస్తోంది. ఇక లక్నో విషయానికొస్తే..పెట్రోల్ ధర 4 పైసలు, డీజిల్ 4 పైసలు పెరిగింది. దీంతో ఒక్క సారిగా రేట్టు ఆకాశాన్ని అంటాయి. ఇక తాజా రేట్ల విషయానికొస్తే.. రూ. 96.61, రూ. 89.80కి విక్రయిస్తున్నారు. ఇక జైపూర్‌లో కూడా పెట్రోలు ధర 11 పైసలు, డీజిల్ ధర 9 పైసలు పెరిగాయి. అక్కడ పెట్రోలు రూ.108.67 కాగా, డీజిల్ రూ.93.89కి విక్రయిస్తున్నారు. గురుగ్రామ్‌లో ధరలు స్థిరంగా ఉండడం వల్ల ఇక్కడ ధరలో ఎలాంటి మార్పులు రాలేదు.
Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!
ప్రధాన నగరాలు, ధరలు:
1. ఢిల్లీ: పెట్రోల్ రూ. 96.72, డీజిల్ లీటర్ రూ. 89.62
2. చెన్నై: పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24
3. కోల్‌కతా:పెట్రోలు రూ. 106.03, డీజిల్ లీటరుకు రూ. 92.76
4. ముంబై: పెట్రోల్ రూ.106.31, డీజిల్ లీటరుకు రూ.94.27
5. హైదరాబాద్: పెట్రోల్ రూ.109.66, డీజిల్ లీటరుకు రూ. 97.82
తాజా పెట్రోల్, డీజిల్ ధరను తెలుసుకోవాలనుకుంటున్నారా..?:
మీరు కూడా సులభంగా తాజా పెట్రోల్, డీజిల్ ధరను తెలుసుకోవాలనుకుంటే, కేవలం SMS సహాయంతో ప్రతి రోజూ ధరలను తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు ఇండియన్ ఆయిల్ ధర కోసం RSP <డీలర్ కోడ్> వ్రాసి 9224992249కి పంపండి. HPCL కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్> అని 9222201122కి SMS చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా మీరు రోజువారి పెట్రోల్, డీజిల్ ధరను తెలుసుకోవచ్చు.
Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook