టెంపర్ హిందీ రీమేక్ 'సింబ ట్రైలర్' వచ్చేసింది

టెంపర్ హిందీ రీమేక్ 'సింబ ట్రైలర్'

Last Updated : Dec 3, 2018, 06:06 PM IST
టెంపర్ హిందీ రీమేక్ 'సింబ ట్రైలర్' వచ్చేసింది

2015లో టాలీవుడ్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కి సరైన సమయంలో సూపర్ హిట్ ఇచ్చిన సినిమా టెంపర్. తెలుగులో రికార్డులు సృష్టించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను చెన్నై ఎక్స్ ప్రెస్ ఫేమ్ దర్శకుడు రోహిత్ శెట్టి హిందీలో రీమేక్ చేశాడు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్‌తో కలిసి రోహిత్ శెట్టి స్వయంగా నిర్మించిన ఈ రీమేక్ సినిమాకు 'సింబ' అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 'టెంపర్'లో ఎన్టీఆర్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రను హిందీలో రణ్‌వీర్ సింగ్ నటించగా కాజల్ అగర్వాల్ పోషించిన పాత్రలో సారా అలీ ఖాన్ నటించింది. 

రణ్‌వీర్ సింగ్ పెళ్లి చేసుకున్న తర్వాత రిలీజ్ అవుతున్న తొలి సినిమా ఇదే కాగా ఈ సినిమాతోనే సైఫ్ అలీ ఖాన్ గారాలపట్టి సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ అతిధి పాత్రలో నటించిన ఈ రీమేక్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. మరి మన తెలుగు 'టెంపర్'కి తగినట్టుగా హిందీ సింబ సినిమా ట్రైలర్ ఉందో లేదో మీరే చెక్ చేయండి.

 

Trending News