RAM Rapid Action Mission: ప్రతీ టికెట్‌పై రూ.5 నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తాం.. దేశ సైనికులకు 'రామ్‌' అంకితం: నిర్మాత దీపికాంజలి

RAM Rapid Action Mission Pre Release Event:  జనవరి 26న ఆడియన్స్‌ను అలరించేందుకు రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. టీజర్, ట్రైలర్‌‌లతో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ.. రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 06:05 PM IST
RAM Rapid Action Mission: ప్రతీ టికెట్‌పై రూ.5 నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తాం.. దేశ సైనికులకు 'రామ్‌' అంకితం: నిర్మాత దీపికాంజలి

RAM Rapid Action Mission Pre Release Event: సూర్య అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ హీరోహీరోయిన్స్‌గా.. హిరామ్ వైనతేయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ  రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్). దేశ భక్తిని చాటే విధంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఆడియన్స్‌ ముందుకు రానుంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా దీపికాంజలి వడ్లమాని నిర్మించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌‌లతో మంచి అంచనాలు నెలకొన్నాయి. మంగళవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. 

ఈ సందర్భంగా పీపుల్ మీడియా ఫాక్టరీ అధినేత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌తో రామ్ మూవీ రాబోతుందన్నారు. ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కొని ఈ సినిమాను నిర్మించారని.. తాను రషెస్ చూశానని చాలా బాగా వచ్చిందన్నారు. తనకు మొదటి సినిమానే అయినా.. సాయి కుమార్ పక్కన సూర్య చక్కగా యాక్ట్ చేశారని మెచ్చుకున్నారు. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

ప్రొడ్యూసర్ బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ.. తమ ప్రాణాలను పణంగా పెట్టి.. దేశం కోసం సైనికులు పోరాడుతుంటారని అన్నారు. మన సైనికులు, ప్రాణ త్యాగాల మీద చాలా సినిమాలు వస్తుంటాయని.. ఇలాంటి ఓ మంచి సందేశాత్మక మూవీ తీసిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్ అని చెప్పారు. సైనికుల త్యాగాలను చూపించి అందరికీ మరోసారి వారి గొప్పదనాన్ని చాటి చెప్పారని అభినందించారు. తనను తాను నిరూపించుకునేందుకు సూర్య చాలా కష్టపడ్డారని.. సాయి కుమార్, ధన్యా బాలకృష్ణ పాత్రలు బాగున్నాయని అన్నారు. ఈ సినిమాను ఆడియన్స్ అందరూ చూసి విజయాన్ని అందించాలని కోరారు. 

ఒక్క హిట్ ఇస్తే.. ఇండస్ట్రీ అంతా తిరిగి చూస్తుందని.. అందుకే ఈ మూవీని తీసినట్లు హీరో సూర్య అయ్యలసోమయాజుల తెలపారు. తాను, డైరెక్టర్, కెమెరామెన్ ధారన్ సుక్రి, నా ఫ్రెండ్స్ పిల్లర్స్‌గా నిలిచామన్నారు. తన ఫ్రెండ్స్ అంతా కలిసి ఫండింగ్ చేసి ఈ సినిమా నిర్మించారని చెప్పారు. చిన్న చిత్రం.. పెద్ద చిత్రం అనేది ఉండదని.. మొన్నే పెద్ద చిత్రాల మధ్యలో చిన్న సినిమా వచ్చి నిలబడిందని హనుమాన్ మూవీని ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు కూడా పెద్ద చిత్రాల నడుమ చిన్న చిత్రం రాబోతోందని.. రామ్ అంటే భక్తి సినిమా కాదు.. దేశ భక్తి అని చాటి చెప్పే సినిమా అని చెప్పారు. ఇక మున్ముందు రామ్ పేరు వినిపిస్తూనే ఉంటుందన్నారు. సినిమాలో ప్రతీ డైలాగ్ తూటాలా ఉంటుందని.. క్లైమాక్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందన్నారు. 

అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత దేశ భక్తిని చాటే సినిమాలో నటించానని చెప్పారు. మూవీలో ఫైట్స్ అన్నీ బాగుంటాయని.. డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయన్నారు. సినిమాకు తమ వంతుగా చేశామని.. ఇక నిర్ణయం ప్రజలదేన్నారు. ప్రస్తుతం అంతటా హనుమాన్ ఆడుతోందని.. ఇప్పుడు ఈ రామ్ మూవీ కూడా అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. దేశ భక్తిని చాటి చెప్పే సినిమానే కానీ.. సరిహద్దులు ఉండే సైనికుల గురించి చెప్పేది కాదన్నారు డైరెక్టర్ మిహిరాం. దేశసరిహద్దు లోపల ఉగ్ర దాడుల నుంచి ప్రజలను కాపాడే అన్‌సంగ్ హీరోల గురించి చూపించినట్లు చెప్పారు. తమకు ఇప్పుడు థియేటర్లు దొరకడం కూడా కష్టంగా ఉందని.. కానీ మంచి థియేటర్లను తీసుకువచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్ గణేష్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి.. మంచి విజయాన్ని అందించాలని కోరారు.

ఈ సినిమా ప్రతి టికెట్‌ నుంచి 5 రూపాయలు నేషనల్ డిఫెన్స్‌ ఫండ్‌కు ఇస్తామని నిర్మాత దీపికాంజలి తెలిపారు. డైరెక్టర్ చెప్పిన బడ్జెట్‌లో సినిమా తీశారని.. సూర్య చక్కగా నటించారని చెప్పారు. ధన్యా బాలకృష్ణ చేసిన ఓ ఎమోషనల్ సీన్‌కు ఆడియన్స్ కంటతడి పెడతారని అన్నారు. మన దేశ సైనికులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నామన్నారు. సినిమాకు మంచి విజయం అందివ్వాలని హీరోయిన్ ధన్యా బాలకృష్ణ కోరారు.  

Also Read: Sharmila fire on Jagan: బీజేపీతో అన్నయ్య కుమ్మక్కు.. సీఎం జగన్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

Also Read: Parliament Elections: కాంగ్రెస్‌కు మమత భారీ షాక్‌.. బెంగాల్‌లో కటీఫ్‌.. ఢిల్లీలో దోస్తీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News