Suryadevara Radhakrishna: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు మాతృమూర్తిని కోల్పోయారు. 90 ఏళ్ల సూర్యదేవర నాగేంద్రమ్మ వృద్ధాప్య సమస్యలతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం కన్నుమూశారు. ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. నాగేంద్రమ్మకు మొత్తం నలుగురు సంతానం. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఆమె రెండో కుమారుడు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ. రాధాకృష్ణ కుమారుడు సూర్యదేవర నాగవంశీ కూడా నిర్మాతగా మారాడు. అంటే నాగవంశీకి నాగేంద్రమ్మ నాయనమ్మ అవుతారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని శ్మశాన వాటికలో నిర్వహిస్తారని కుటుంబసభ్యులు వెల్లడించారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పేరుతో బ్యానర్ ప్రారంభించి ఎన్నో సినిమాలను నిర్మించిన నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ. తండ్రి బాటలోనే కుమారుడు నాగవంశీ నిర్మాతగా మారాడు. అతడు తాజాగా నిర్మించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. విశ్వక్‌సేన్ నటించిన ఈ సినిమా శుక్రవారమే విడుదలవుతోంది. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే నాగవంశీ ఇంట్లో విషాదం చోటుచేసుకోవడం గమనార్హం. సినిమా విడుదలవుతున్న శుక్రవారం రోజే నాగవంశీ నాయనమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మృతి వార్త తెలుసుకున్న చిత్రబృందం నాగవంశీకి ఫోన్లు చేసి సంతాపం తెలిపినట్లు సమాచారం.
Also Read: HHVM: ఒక్క సినిమాకి నలుగురు దర్శకులు..ఆందోళనలో పవన్ ఫ్యాన్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter