Nivetha pethuraj: పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటి నివేదా .. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్..

Actress nivetha pethuraj: టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ ను పోలీసులు అడ్డగించారు. ఆమె డిక్కీని ఓపెన్ చేయాలని కోరారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Written by - Inamdar Paresh | Last Updated : May 30, 2024, 12:23 PM IST
  • నటి నివేదా పేతురాజ్ కు బిగ్ ట్విస్ట్...
  • ఆమె చేసిన పనిని రికార్డు చేసిన పోలీసులు..
Nivetha pethuraj: పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటి నివేదా .. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్..

Nivetha pethuraj strongly arguing with police: టాలీవుడ్ నటి నివేదా పేతురాయ్ తన దైన యాక్టింగ్ తో అందరిని కట్టిపడేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ.. తెలుగుతో పాటు అనేక భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో అందరికి ఫిదా చేస్తుంది. తెలుగు సినిమాల్లో ఈ అమ్మడికి.. విశ్వక్ సేన్ తో నటించిన పాగల్, ధమ్కీ మూవీలతో మంచి గుర్తింపు లభించిందని చెప్పుకొవచ్చు. ఇక మరోవైపు నివేదా.. 2016 లో వచ్చిన ఓరు నాల్ కూతు అనే తమిళ మూవీతో తొలిసారి నటిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 20217 లో మెంటల్ మదిలో మూవీలో నటించి మంచి పేరు సంపాదించారు.  తెలుగు ఇండస్ట్రీలో..  బ్రోచేవారెవరురా, చిత్రలహారి, అల.. వైకుంఠపురంలో, రెడ్ అనే మూవీలో నటించారు.

 

ఇదిలా ఉండగా నివేదా పేతురాజ్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. ఆమెను కొందరు పోలీసులు ఆపారు. కారు డాక్యుమెంట్స్ అడిగారు. ఆ తర్వాత కారు డిక్కీలను ఓపెన్ చేయాలిన కోరారు.  కానీ ఆమె డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయి.. తాను ఎందుకు కార్ డిక్కీ తీయాలని పోలీసులకు రివర్స్ లో ప్రశ్నిస్తుంది. దీనికి పోలీసులు.. ఘటనను రికార్డు చేస్తు.. మా డ్యూటీ మమ్మల్ని చేయనీయండి.. కారు డిక్కి తెరవాలని తెల్చిచెప్పారు. 

దీంతో హీరోయిన్ ఇది పరువుకు సంబంధించింది.. మీకు చెప్పిన అర్థంకాదు.. అంటూ పోలీసుల మీద ఫైర్ అవుతుంది. వీడియో తీస్తున్న పోలీసుల పైన కూడా దాడికి ట్రై చేస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు.. అసలు ఇది నిజంగా  జరిగిందా.. లేదా పబ్లిసిటీ స్టంటా.. అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంప దీసి సినిమా ప్రమోషన్ లో భాగంగా తీసింది కాదు కదా.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైన ఈ వీడియో మాత్రం వార్తలలో నిలిచింది. దీనిపైన నివేదా పెతురాయ్ మాత్రం ఇప్పటిదాక స్పందించలేదు. 

Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..

దేశంలో ప్రస్తుతం ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. నార్మల్ గా పోలీసులు ఈ సమయంలో ఎక్కడైన తమకు అనుమానం కల్గితే వాహానాలు ఆపి తనిఖీలు చేస్తుంటారు.  ఇలాంటి సందర్భాలలో పోలీసులకు చాలా మంది రాజకీయ నాయకులు, వీఐపీలు తనిఖీలకు సహకరిస్తారు. కానీ కొన్ని చోట్ల మాత్రం, పోలీసులకు తనిఖీల సమయంలో చుక్కలు కన్పిస్తుంటాయి. తాగి పోలీసులపైనే దాడిచేసిన ఘటనలు కొకొల్లలు. ఇటీవల కాలంలో.. వీఐపీలు, పొలిటిషియన్లు, బడాబాబుల పిల్లలు తాగి, ఇష్టమున్నట్లు వాహనాలు నడిపి రోడ్డుప్రమాదాలకు కారణమవుతున్న విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News