సూర్య నటిస్తున్న ఆకాశమే నీ హద్దురా టీజర్ విడుదల

తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’. ఈ చిత్రానికి సాలా ఖాదూస్ చిత్ర దర్శకురాలు సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వం వహిస్తోంది. సాలా ఖాదూస్ చిత్రంలో మాధవన్ బాక్సర్ పాత్రలో నటించాడు. ఆకాశమే నీ హద్దురా చిత్రంలో టాలీవుడ్ డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబు ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. 

Last Updated : Jan 7, 2020, 07:27 PM IST
సూర్య నటిస్తున్న ఆకాశమే నీ హద్దురా టీజర్ విడుదల

హైదరాబాద్ : తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’. ఈ చిత్రానికి సాలా ఖాదూస్ చిత్ర దర్శకురాలు సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వం వహిస్తోంది. సాలా ఖాదూస్ చిత్రంలో మాధవన్ బాక్సర్ పాత్రలో నటించాడు. ఆకాశమే నీ హద్దురా చిత్రంలో టాలీవుడ్ డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబు ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. 

నిర్మాత గునీత్ మోంగా 'పీరియడ్' ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఉత్తమ 'షార్ట్ సబ్జెక్ట్'  అనే చిన్న డాక్యుమెంటరీ 91వ అకాడమీ అవార్డులలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న గునీత్ మొంగాతో కలిసి తన సొంత బ్యానర్ 2డి ఎంటర్ టైన్మెంట్ పై సూర్య ఈ మూవీని నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సస్పెన్స్‌ అంశాలతో రూపొందించిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని వేసవి కాలంలో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ కసరత్తు చేస్తోందని చెబుతున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News