Where is Pushpa: కట్టప్ప మిస్టరీలా పుష్ప ఎక్కడ? సుక్కూ ప్లానింగ్ అదుర్స్?

Pushpa 2 Promotions: పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ గా నిలిచిన క్రమంలో రెండో భాగాన్ని వేరే లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇక బాహుబలి తరహాలోనే ఒక ప్లాన్ సిద్దం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.   

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 7, 2023, 07:35 AM IST
Where is Pushpa: కట్టప్ప మిస్టరీలా పుష్ప ఎక్కడ? సుక్కూ ప్లానింగ్ అదుర్స్?

Bahubali Type Strategy for Pushpa 2 Promotions: పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్, మొత్తం శెట్టి మీడియా బ్యానర్ల మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించగా ఊహించని మేర లాభాలు అందుకున్నారు నిర్మాతలు. మొదటి భాగంలో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫహద్ ఫాజిల్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.

ఈ సినిమా ఊహించని విధంగా నార్త్ లో సంచలనాలు సృష్టించడంతో రెండో భాగాన్ని మరింత గ్రాండ్ లెవెల్లో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాని కేజిఎఫ్ 2 కలెక్షన్స్ చూసిన తర్వాత వేరే లెవల్లో నిర్మిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. కానీ ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన తాజా వీడియో మాత్రం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. రేపు ఫుల్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తామని చెబుతున్నా ఇప్పటివరకు విడుదల చేసిన చిన్న బిట్లో పుష్ప ఎక్కడ అనేది ముఖ్యంగా హైలైట్ చేసినట్లు కనిపిస్తోంది.

నిజానికి పాన్ ఇండియా సినిమాలకు ఆజ్యం పోసిన బాహుబలి సినిమాలో కూడా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే విషయాన్ని ఎక్కువగా హైలైట్ చేశాడు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు పుష్ప 2 సినిమా విషయంలో కూడా పుష్ప ఎక్కడ ఉన్నాడు? అనే విషయాన్ని హైలైట్ చేసేందుకు దర్శకుడు సుకుమార్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇలాంటి అంశాలను ప్రేక్షకులలోకి తీసుకువెళ్తే కచ్చితంగా అందరూ థియేటర్ల వరకు వస్తారని ఆయన నమ్ముతున్నట్టు చెబుతున్నారు.

నిజానికి బాహుబలి మొదటి భాగంలో కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడుస్తున్నట్లు చూపించా.రు కానీ పుష్ప మొదటి భాగం క్లైమాక్స్ లో పుష్ప శ్రీవల్లిని వివాహం చేసుకున్నట్లు చూపించారు. తర్వాత సిండికేట్ నడిపే స్థాయికి చేరుకున్నట్లు చూపించారు కానీ ఆ తరువాత ఏం జరిగిందనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. బహుశా దానికి సంబంధించిన కొనసాగింపుగా రేపు రిలీజ్ చేయబోయే వీడియో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

శ్రీవల్లి వివాహం చేసుకున్న తర్వాత ఒక కేసులో జైలుకు వెళ్లిన పుష్ప బుల్లెట్ గాయాలతో జైలు నుంచి తప్పించుకున్నాడు. ఆ తరువాత ఎక్కడికి వెళ్ళాడు అనే కోణాన్ని ప్రేక్షకుల్లో రిజిస్టర్ చేసేందుకే పుష్ప మేకర్స్ ఈ విధమైన ప్రమోషన్ చేస్తున్నారా అనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు, సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకుండానే సినిమా నుంచి అప్డేట్స్ ఇవ్వటం అనేది ఎందుకు ప్రేక్షకులంలో కొంత సినిమా మీద ఆసక్తి రేకెత్తించే ప్రయత్నమే అనిపిస్తుంది.

అయితే రేపు పూర్తి వీడియో విడుదలయితే అసలు అల్లు అర్జున్ క్యారెక్టర్ పుష్ప సెకండ్ పార్ట్ లో ఎలా ఉంటుంది? అసలు ఈ సినిమా కథ ఏమై ఉంటుంది? అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సుకుమార్ లెక్కలు మాస్టర్ కావడంతో ఈ సినిమాని మార్కెట్ చేసే విషయంలో కూడా గట్టిగానే లెక్కలు వేస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది.

Also Read: Devarakonda-Jr NTR: లైగర్ దెబ్బకు జడిసిన యష్ రాజ్ ఫిలింస్.. లేదంటే ఎన్టీఆర్ బదులు?

Also Read: Ravanasura Pre Release: రావణాసుర సినిమా ఎన్ని కోట్లకు అమ్మారో తెలుసా? హిట్ కొట్టాలంటే టార్గెట్ ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News