Mustard Leaves Benefits: ఈ ఆకు కూరతో సీజనల్‌ వ్యాధులన్నీ చెక్‌.. మీరు తప్పకుండా ట్రై చేయండి..

Mustard Leaves Benefits: క్రమం తప్పకుండా ఆవాల ఆకుల కూరను ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా సీజన్‌ మారడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకునే ప్రయత్నం చేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 04:22 PM IST
Mustard Leaves Benefits: ఈ ఆకు కూరతో సీజనల్‌ వ్యాధులన్నీ చెక్‌.. మీరు తప్పకుండా ట్రై చేయండి..

Mustard Leaves Benefits: చలికాలం రాగానే మార్కెట్‌లోకి పచ్చి ఆకు కూరలు విపరీతంగా వస్తుంటాయి. అంతేకాకుండా చాలా మంది భారతీయులు ఈ క్రమంలో ఆకు కూరలను తినేందుకే ఇష్టపడతారు. అయితే చాలా మంది తేలియని విషయం ఏమిటంటే ఆకు కూరల్లో భాగంగా ఆవాల ఆకులను కూడా ఆహారంగా తింటారని..ఈ ఆకుల శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా సీజనల్‌ వచ్చే వ్యాధులు కూడా తగ్గుతాయి.

చలికాలంలో ఆవాల ఆకు కూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

అధిక పరిమాణంలో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి:
ఆవాల ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ ఆకు కూరను చలి కాలంలో ఆహారంలో తీసుకుంటే శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తొలగిపోతాయి. ఇందులో ఉండే గుణాలు గుండె నుంచి మెదడు వరకు ప్రతిదానిని ప్రభావితం చేస్తాయి. ఆవాలలో ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

విటమిన్ K:
వండిన ఆవాలు ఆకు కూరను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి అధిక పరిమాణంలో విటమిన్ K లభిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. విటమిన్ కె గుండెను ఆరోగ్యంగా చేస్తాయి. అంతేకాకుండా రక్తాన్ని గడ్డకట్టకుండా సహాయపడుతుంది. అయితే ఈ కూర ఎముకలను కూడా దృఢంగా తయారు చేయడానికి సహాయపడతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా దీనిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.

కళ్లకు మేలు చేస్తుంది:
ఆవకూరలో ల్యూటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటికి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా కంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.

రోగనిరోధక శక్తి:
శరీరానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. అయితే అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణాలు రోగ నిరోధక శక్తి లోపం వల్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆవాల ఆకు కూరను క్రమం తప్పకుండా తీసుకుంటే  విటమిన్ సి పుష్కలంగా లభించి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read : Matti Kusthi : మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స్

Also Read : Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News