బాలీవుడ్‌లో నటించడానికి సిద్ధమవుతున్న మహ్మద్ సమీ భార్య

మహ్మద్ సమీ భార్య హసీన్ జహాన్ బాలీవుడ్‌లో నటించడానికి సిద్ధమవుతోంది. ఓ సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చిందని.. ఆ చిత్రంలో ఆమె జర్నలిస్టు పాత్ర పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో తనను వేధింపులకు గురి చేస్తున్నాడని షమీ భార్య ఆయనపై పలు కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. 

Last Updated : Jul 14, 2018, 03:27 PM IST
బాలీవుడ్‌లో నటించడానికి సిద్ధమవుతున్న మహ్మద్ సమీ భార్య

మహ్మద్ సమీ భార్య హసీన్ జహాన్ బాలీవుడ్‌లో నటించడానికి సిద్ధమవుతోంది. ఓ సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చిందని.. ఆ చిత్రంలో ఆమె జర్నలిస్టు పాత్ర పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో తనను వేధింపులకు గురి చేస్తున్నాడని షమీ భార్య ఆయనపై పలు కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో జహాన్ పలుమార్లు తన బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు.

దర్శకుడు అమ్జద్ ఖాన్ తనకు అవకాశం కల్పిస్తానని తెలిపారని పేర్కొన్నారు. తాను ఇది వరకే ముంబయి వెళ్లి పలు మోడలింగ్ షూట్స్‌లో పాల్గొన్నానని ఆమె తెలిపారు. తన సినిమా షూటింగ్ అక్టోబరులో ప్రారంభయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా మహ్మద్ సమీ భార్య మీడియాకి చెప్పారు. షమీ భార్య జహాన్ గతంలో తన భర్త పై ఆరోపణలు చేస్తూ.. ఆయనకు పలువురు అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని.. అలాగే మ్యాచ్ ఫిక్సింగ్‌లో కూడా పాల్గొన్నాడని చెప్పడం పెద్ద దుమారమే రేపింది. 

షమీ నుండి తాను ప్రతీ నెల 10 లక్షల రూపాయలను జీవన భృతిగా కూడా కోరుతున్నానని జహాన్ తెలిపారు. అయితే ఆమె చేసిన ఆరోపణలు అన్నింటికీ అప్పట్లో షమీ మౌనమే సమాధానమైంది. తనపై, తన కుటుంబంపై జహాన్ పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తుందని మాత్రం ఓ సారి ఆయన తెలిపారు. జహాన్ చేసిన ఆరోపణలు ఏమీ కూడా షమీ జీవితం పై ప్రభావం చూపించలేదు. ఆయన పై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా అబద్ధమేనని తర్వాత తేలింది. 

Trending News