Kerala Traffic Challan: ఇదేందయ్యో ఇది.. పెట్రోల్ తక్కువగా ఉందని చలాన్ చేసిన ట్రాఫిక్ పోలీసులు!

kerala IT man Basil Syam fined Rs 250 for driving without sufficient fuel. మోటార్‌ సైకిల్‌లో పెట్రోల్ తక్కువగా ఉందని చలాన్ చేసిన ఘటన తాజాగా కేరళలో వెలుగులోకి వచ్చింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 28, 2022, 03:51 PM IST
  • కేరళలో వింత ఘటన
  • పెట్రోల్ తక్కువగా ఉందని చలాన్
  • ఇది చాలా ఫన్నీ గురూ
Kerala Traffic Challan: ఇదేందయ్యో ఇది.. పెట్రోల్ తక్కువగా ఉందని చలాన్ చేసిన ట్రాఫిక్ పోలీసులు!

kerala IT man Basil Syam fined Rs 250 for driving without sufficient fuel: వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించడం సహజమే. వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ కార్డ్, హెల్మెంట్ లేకుంటే చలాన్లు వేస్తారు. అదే విధంగా రాంగ్ రూట్‌లో వెళ్లినా, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్‌లైట్ పడినా ఆగకుండా వెళ్లినా, రాష్ డ్రైవింగ్ చేసినా, మైనర్లు డ్రైవింగ్ చేసినా.. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తారు. అయితే పెట్రోల్ తక్కువగా ఉందని చలాన్ చేసిన ఘటన తాజాగా కేరళలో వెలుగులోకి వచ్చింది.  విషయంలోకి వస్తే.. 

 ఐటీ ఉద్యోగి బాసిల్ శ్యామ్ తన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌ సైకిల్‌పై కొచ్చిలోని పుక్కట్టుపడి ఏరియా నుంచి ఉదయం 10 గంటల సమయంలో ఆఫీస్‌కు వెళుతున్నాడు. వన్ వేలో ప్రయాణిస్తుండగా.. ట్రాఫిక్ కానిస్టేబుల్ బండిని ఆపి రూ. 250 చలాన్ విధించారు. శ్యామ్ ఫైన్ కట్టేసి ఆఫీస్‌కు వెళ్ళాడు. చలానాలో ఏముందోనని ఓసారి చెక్ చేయగా అతడికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. వాహనంలో సరిపడా ఇందనం  లేదందుకు జరిమానా విధించినట్టు ఆ రసీదులో ఉంది. 

బాసిల్ శ్యామ్ ఆ రసీదును తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేయడంతో విషయం కాస్త వైరల్‌గా మారింది. ఈ ఘటన జులై 22న పుక్కట్టుపడి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ట్రాఫిక్ చలాన్‌పై మరింత సమాచారం తెలుసుకునేందుకు నిపుణులతో మాట్లాడగా ఓ విషయం తెలిసింది. కేరళ రవాణా చట్టంలోని నిబంధనల ప్రకారం.. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే వాణిజ్య వాహనాలు అయిన కారు, బస్సు, ఆటో వంటివి ఇందనం లేకుండా ఆగిపోతే డ్రైవర్, యాజమానికి రూ. 250 జరిమానా విధించే అవకాశం ఉందట. అయితే ఈ చలాన్‌లో రాంగ్ రూట్ అని నమోదు చేయకుండా ఇంధన తక్కువగా ఉందని పేర్కొనడం విశేషం. 

మొత్తానికి ట్రాఫిక్ పోలీస్ విధించిన ఈ వింత జరిమానా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చలాన్ చూసిన అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. నెటిజన్లు ట్రాఫిక్ పోలీసుల తీరుపై తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. 'ఇదేందయ్యో ఇది.. ఇది నేనెక్కడా చూడలే' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇది చాలా ఫన్నీ గురూ' అంటూ ఇంకొకరు ట్వీట్ చేశారు. 

Also Read: Apple Tea Benifits: అధిక బరువుతో బాధపడుతున్నారా.. 'యాపిల్ టీ'తో మీ సమస్యకు చెక్.. ఎలా తయారుచేసుకోవాలంటే..

Also Read: Komatireddy: అనర్హత వేటు కోసమే సస్పెన్షన్ లేటు? కోమటిరెడ్డి విషయంలో కాంగ్రెస్ పక్కా స్కెచ్?  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News