Healthy Weight Tips: బరువు పెరగకుండా, తగ్గకుండా హెల్తీ వెయిట్ కావాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే!

How To Maintain Body Weight After Weight Loss: చాలామంది బరువు తగ్గిన తర్వాత దానిని నిలకడగా ఉంచుకోలేకపోతున్నారు. దీని కారణంగా శరీర బరువు పెరిగి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. అయితే ఇప్పటికే బరువు బరువు తగ్గిన వారు తప్పకుండా వీటిని పాటించండి.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 27, 2023, 05:01 PM IST
Healthy Weight Tips: బరువు పెరగకుండా, తగ్గకుండా హెల్తీ వెయిట్ కావాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే!

How To Maintain Healthy Weight: ప్రస్తుతం చాలామంది అందంగా కనిపించేందుకు వెయిట్ లాస్ అవుతున్నారు. వెయిట్ లాస్ అవ్వడం వల్ల మనిషి శరీరానికి చాలా రకాల లాభాలు ఉన్నాయి. శరీరం ఫిట్నెస్ గా కనిపించడమే కాకుండా ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. చాలామంది బరువు తగ్గిన తర్వాత చేయకూడని పనులు చేసి అతిగా బరువు పెరుగుతున్నారు. దీనివల్ల వెయిట్ గైన్ అవ్వడమే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గే క్రమంలో పాటించిన పద్ధతులే తప్పకుండా మళ్లీ పాటించాల్సి వస్తుందని వైద్యులు అంటున్నారు. అయితే బరువు తగ్గిన తర్వాత మళ్లీ పెరగడానికి కారణాలేంటో? శరీర బరువును కట్టడిలో ఉంచడానికి ఎలాంటి నియమాలు పాటించాలో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తప్పకుండా బరువును కట్టడిలో ఉంచుకోవడానికి ఇలా చేయాలి:
చాలామంది బరువు తగ్గిన తర్వాత వ్యాయామాలతో పాటు జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. చేయడం వల్ల మళ్లీ బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అందుకోసం ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ఈ కింది చిట్కాలు పాటించాలి. 

Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   

క్రమం తప్పకుండా వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి:
బరువు తగ్గిన తర్వాత చాలామంది ఉదయాన్నే చేసే వ్యాయామాలు మానుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మళ్లీ శరీర బరువు పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శరీర బరువు అదుపులో బాడీలో ఉండే కేలరీలు బర్నవ్వడానికి ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీర ఆకృతి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోజు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి:
బరువు తగ్గిన తర్వాత అనారోగ్యకరమైన ఆహారాలను అస్సలు ముట్టుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను బరువు తగ్గిన తర్వాత తీసుకోవడం వల్ల మళ్లీ బరువు పెరిగే ఛాన్స్ ఉందని, బరువు నిలకడగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీలైతే కీటో డైట్ పద్ధతిలో ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది.

జీవనశైలిలో మార్పులు:
బరువు తగ్గిన తర్వాత అదే బరువును నిలకడగా ఉంచుకోవడానికి.. తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఆధునిక జీవన శైలికి అలవాటు పడ్డవారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మార్పులు చేసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని కూడా వారు చెబుతున్నారు.

Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News