రామ్ చరణ్ కు గాయాలు.. RRR షూటింగ్ కు బ్రేక్ !!

                                                     

Last Updated : Apr 3, 2019, 06:35 PM IST
రామ్ చరణ్ కు గాయాలు.. RRR షూటింగ్ కు బ్రేక్ !!

మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్...మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ ప్రమాదవశాత్తు గాయాలపడ్డాడు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం  జిమ్ లో వర్కవుట్ చేస్తూ చెర్రీ గాయపడినట్లు తెలిసింది. గాయం స్వల్పమేనని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. అయితే రాంచరణ్ కు వారం నుంచి రెండు వారాల విశ్రాంతి అవసరమని  వైద్యులు పేర్కొన్నారు

రామ్ చరణ్ కు గాయమవడంతో RRR చిత్ర యూనిట్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూవీలో హీరోగా నటిస్తున్న మెగా పవర్ స్టార్ గాయం నుంచి కోలుకునే వరకు షూటింగ్ నిలిపివేయాల్సిన  పరిస్థితి నెలకొంది..అందుకే సినిమా షూటింగ్ ను రద్దుచేశారు. తిరిగి 3 వారాల తర్వాత ఆర్-ఆర్-ఆర్ పూణె షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని చిత్రయూనిట్ పేర్కొన్నారు.

Trending News