అల్లు అర్జున్ తో అలరించబోతోన్న దిశా పటాని..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రీయేటీవ్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కించబోతోన్న చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.

Last Updated : May 2, 2020, 07:22 PM IST
అల్లు అర్జున్ తో అలరించబోతోన్న దిశా పటాని..

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రీయేటీవ్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కించబోతోన్న చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో బన్నీకి జోడీగా యంగ్ బ్యూటీ రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేస్తోంది. 

Also Read: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతీ ఇంట్లో ఒకరికి కరోనా పరీక్ష

ఇటీవల విడుదల చేసిన బన్నీ లుక్ కు భారీ స్పందన వచ్చిందని, దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ చిత్రంలో ప్రత్యేక సాంగ్ చిత్రీకరణ కోసం సుకుమార్ ఓ బాలీవుడ్ హీరోయిన్ ను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ, హాట్ హీరోయిన్ గా అలరిస్తున్న దిశా పటాని ఈ స్పెషల్ సాంగ్ లో బన్నీ సరసన చిందేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో బన్నీ డ్యాన్స్ కు ఈ హాట్ బ్యూటీ ఫిదా అయినట్లు తెలిపింది. కాగా, పూరి జగన్నాథ్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో తెలుగు తెరకు దిశ పటానీ పరిచమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత దిశ పటానీ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News