Dhanteras Gold Offers: కేవలం ఒక్క రూపాయితో 24 క్యారెట్ల బంగారం కొనుగోలు, ఎలా సాధ్యమంటే..?

Dhanteras Gold Offers: దేశంలో ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ క్రేజ్ నడుస్తోంది. దీపావళి, దంతేరస్ ప్రత్యేక పండుగల్ని పురస్కరించుకుని ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ బంగారంపై ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. ఆ ఆఫర్ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 13, 2022, 08:29 PM IST
Dhanteras Gold Offers: కేవలం ఒక్క రూపాయితో 24 క్యారెట్ల బంగారం కొనుగోలు, ఎలా సాధ్యమంటే..?

Dhanteras Gold Offers: దీపావళి పండుగ సమీపిస్తోంది. దంతేరస్ వేడుకతో దీపావళి పండుగ ప్రారంభమౌతుంది. దంతేరస్ నాడు బంగారం కొనడం శుభ సూచకంగా భావిస్తారు. అందుకే బంగారంపై వివిధ ఆన్‌లైన్ సంస్థలు ఆఫర్లు అందిస్తున్నాయి. ఈసారి డిజిటల్ గోల్డ్ క్రేజ్ కన్పిస్తోంది. 

ఐదురోజుల పాటు నిర్వహించుకునే దీపావళి పండుగ.. మొదటిరోజు దంతేరస్‌తో ప్రారంభమౌతుంది. అందుకే దంతేరస్ రోజున పెద్దఎత్తున బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఫిజికల్ గోల్డ్‌తో పాటు డిజిటల్ గోల్డ్ క్రేజ్ పెరుగుతోంది. డిజిటల్ గోల్డ్ అనేది ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. అదే సమయంలో కొన్ని ఆన్‌లైన్ పేమెంట్ సంస్థలు ఆఫర్లు అందిస్తున్నాయి. 

ఈ ఆఫర్లలో భాగంగా పసిడి ప్రియులు కేవలం 1 రూపాయి ఖర్చుతో 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేయవచ్చు. మరి కొంతమంది హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారు. లేదా కొని తమవద్దే ఉంచుకునే అవకాశం కూడా ఉంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన తరువాత సర్వీస్ ప్రొవైడర్‌లో కస్టమర్ వ్యాలెట్ బ్యాలెన్స్ కన్పిస్తుంది. ఆన్‌లైన్ బంగారాన్ని ఎప్పుడైనా సరే మీకు నచ్చినప్పుడు మార్కెట్ ధరకు తక్షణం అమ్మేయవచ్చు కూడా. 

డిజిటల్ గోల్డ్ కొనుగోలు అవకాశం

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ డిజిటల్ గోల్డ్ ప్రొవైడర్ సేఫ్‌గోల్డ్‌తో కలిసి డిజీగోల్డ్ ప్రవేశపెట్టారు. డిజీగోల్డ్‌తో పాటు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కూడా కేవలం నిమిషంలో 24 కేరట్ల బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ బంగారం ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా సురక్షితంగా దాచుకోవచ్చు. లేదా కుటుంబసభ్యులు, స్నేహితులకు బహుమతిగా ఇవ్వవచ్చు. కేవలం ఒక్క రూపాయి పెట్టి కూడా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు.

Also read: Big Diwali Sale: రూ. 25 వేల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 2 వేలకే.. లిమిటెడ్ ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News