ఐశ్వర్యరాయ్‌కి కరోనా పాజిటివ్, జయా బచ్చన్‌కు నెగటివ్

అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. మాజీ ప్రపంచ సుందరి, స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కి కరోనా పాజిటివ్ (Aishwarya Rai Tested Corona Positive)‌గా నిర్ధారించారు. 

Last Updated : Jul 12, 2020, 04:09 PM IST
ఐశ్వర్యరాయ్‌కి కరోనా పాజిటివ్, జయా బచ్చన్‌కు నెగటివ్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. మాజీ ప్రపంచ సుందరి, స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai Bachchan)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. నటితో పాటు ఆమె కూతురు ఆరాధ్యకు కూడా కోవిడ్19 పాజిటివ్‌ (Aaradhya Bachchan Test positive for COVID19)గా తేలింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపె వెల్లడించారు. అమితాబ్ భార్య, సీనియర్ నటి జయా బచ్చన్‌కు మాత్రం కరోనా టెస్టులో నెగటివ్‌గా రావడం ఆ కుటుంబానికి కాస్త ఊరట కలిగించే అంశం. COVID19 లక్షణాలు తక్కువున్నా అమితాబ్ ఆస్పత్రిలో ఎందుకు చేరారంటే!

Image Credit: twitter

తొలుత శనివారం బిగ్ బి అమితాబ్ బచ్చన్‌(Amitabh Bachchan)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అనంతరం తనకు కూడా కోవిడ్19 పాజిటివ్ వచ్చిందని అభిషేక్ బచ్చన్ వెల్లడించడం తెలిసిందే. వీరికి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆదివారం జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యల కోవిడ్19 టెస్టుల ఫలితాలు వచ్చాయి.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Image Credit: twitter/ANI
ఐశ్వర్యరాయ్ ((Aishwarya Rai Tested Corona Positive)‌కి, ఆమె కూతురు ఆరాధ్యకు పాజిటివ్‌గా తేలగా.. సీనియర్ నటి జయా బచ్చన్‌కు నెగటివ్‌గా నిర్ధారించారు. ఏఎన్‌ఐ మహారాష్ట్ర మంత్రి తెలిపిన విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది.  RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News