టాలీవుడ్ టాక్: బండ్ల గణేష్ 'సరిలేరు నీకెవ్వరు' !!

'సరిలేరు నీకెవ్వరు' అంటే మహేష్ బాబు గురించి మాట్లాడాలి కదా..ఇదేంటి బండ్ల గణేష్  ప్రస్తావన వస్తుందేంటి అని ఆశ్చర్య పోతున్నారా ? అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది

Last Updated : Aug 5, 2019, 06:58 PM IST
టాలీవుడ్ టాక్: బండ్ల గణేష్ 'సరిలేరు నీకెవ్వరు' !!

'సరిలేరు నీకెవ్వరు' మూవీకి సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ ద్వారా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆయన కోసం దర్శకుడు ప్రత్యేకమైన పాత్రను రాసినట్లు తెలిసింది.  కథను మలుపు తిప్పే రోల్ లో బండ్ల గణేష్ నటిస్తున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది

దాదాపు సినిమాలకు దూరమయ్యాడని ఆడియన్స్ ఫిక్స్ అయిన తరుణంలో బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.  రాజకీయాల్లోకి వచ్చి ప్లాప్ అయిన బండ్ల గణేష్ ఇక పాలిటిక్స్ కు చెక్ పెట్టాయాలని ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యారు. కాగా టాలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించేందుకు సిద్ధమైన బండ్ల... ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు'  మూవీ ద్వారా తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. మరి ఆడియన్స్ ఈ మాజీ పొలిటియన్ కు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది తేలాల్సి ఉంది. 

ఇదే సినిమాతో ఒకప్పటి హీరోయిన్ విజయ్ శాంతి కూడా రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో విజయశాంతి రోల్ ఎమోషనల్ గా ఉంటే, బండ్ల గణేశ్ క్యారెక్టర్ కామిక్ టచ్ తో ఉంటుందట. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Trending News