Yatra 2 Movie Review:'యాత్ర 2' మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ఎమోషనల్ పొలిటికల్ డ్రామా..

Yatra 2 Movie Review: వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికల్లో చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన మూవీ 'యాత్ర'. ఇపుడు ఆ సినిమాకు కొనసాగింపుగా దర్శకుడు మహి వి రాఘవ 'యాత్ర 2' మూవీ తెరకెక్కిచాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 8, 2024, 01:30 PM IST
Yatra 2 Movie Review:'యాత్ర 2' మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ఎమోషనల్ పొలిటికల్ డ్రామా..

రివ్యూ: యాత్ర 2
నటీనటులు: మమ్ముట్టి, జీవా, మహేష్‌ మంజ్రేకర్,కేతకి నారాయణ్, శుభలేఖ సుధాకర్, ఆశ్రిత వేముగంటి,సుజార్నే బెర్నెర్ట్ తదితరులు..
సినిమాటోగ్రఫీ: ఆర్.మది
సంగీతం: సంతోష్ నారాయణ్
నిర్మాత: శివ మేక
కథ, దర్శకుడు: మహి వి రాఘవ

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించిన 'యాత్ర' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఈ సినిమా 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ అధికారంలోకి రావడానికి ఒకింత దోహదం చేసింది. ఇపుడు యాత్ర 2 సినిమాకు దానికి కొనసాగింపుగా తెరకెక్కించారు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది.. ? యాత్ర మూవీలాగా ఎమోషనల్‌గా సాగిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
2009 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి.. ఆ తర్వాత కొన్ని రోజులుగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక ఎంతో మంది ఆయన అభిమానులు కన్నుమూస్తారు. వైయస్ చావు కారణంగా చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్ఠానం సోనియా గాంధీ ఆ యాత్ర ఆపుచేయాలని కోరుతుంది. చనిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చడం మన సంస్కృతి. దాన్ని ఆపలేనంటూ అధిష్టానానికి ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి కడప బై ఎలక్షన్స్‌లో భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఆ తర్వాత 2014లో ప్రతిపక్ష నేత.. ఆ తర్వాత పాద యాత్ర చేసి 2019లో ఎలా అధికారంలోకి వచ్చాడు. ఈ సందర్భంగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసాడనేదే 'యాత్ర2' మూవీ స్టోరీ.

కథనం విషయానికొస్తే..
2009 సార్వత్రిక ఎన్నికలతో ఈ సినిమాను మొదలు పెట్టి. 2019 ఎన్నికల్లో జగన్  యాత్ర కారణంగా వైయస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా అధికారంలోకి వచ్చాడనే కాన్సెప్ట్‌తో 'యాత్ర 2' మూవీని తెరకెక్కించారు దర్శకుడు మహి వి రాఘవ.
ఈ సందర్భంగా అపుడు కేంద్రంలో అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అప్పటి ప్రతిపక్షం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాజకీయ నాయకుడిగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎదుగులను ఎలా అడ్డుకోవాలనే ప్రయత్నం చేసారు. ఈ నేపథ్యంలో సోనియా, చంద్రబాబు సహా తన రాజకీయ ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తు చేస్తూ 2019లో ఎలా అధికారంలోకి రాగలిగాడనే కాన్సెప్ట్‌ను దర్శకుడు ఎంతో ఎమోషనల్ పొలిటికల్ డ్రామాగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా వై.యస్.రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత అధిష్ఠానం పెద్దలు అంతా ఆయన కోసం వెయిట్ చేస్తుంటే.. ప్రతిపక్ష ఎమ్మెల్యే తనను కలవడానికి వచ్చినపుడు వారిని పక్కన పెట్టి.. అతనితో మాట్లాడటం వంటివి వై.యస్. రాజశేఖర్ రెడ్డిని రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పాడు. తన వల్లనే 2004, 2009లో అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని ఈ సినిమాలో ప్రస్తావించారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి రావడానికి ఏపీలో 30పైగా ఎంపీలను రాజశేఖర్ రెడ్డి గెలిపించి పంపించారనే విషయాన్ని కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేసాడు.

 మరోవైపు వై.యస్.రాజశేఖర్ రెడ్డి పేదల కోసం ఎంతో తాపత్రయ పడేవాడనే విషయాన్ని పుట్టు చెవిటి అయిన అమ్మాయికి ఆపరేషన్ చేయించి వినపడేలా చేయడం. మరోవైపు ఓ అంధుడు రాజశేఖర్ రెడ్డి చేసిన సాయాన్ని ప్రస్తావించడం వంటి అంశాలు ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. అలాగే వై.యస్. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఎంత దూరమైన పోవడం.. మడమ తిప్పకపోవడం వంటి అంశాలు జగన్‌ను అభిమానించే వారు బాగానే కనెక్ట్ అవుతారు. ఇప్పటి వరకు న్యూట్రల్‌ ఓటర్స్‌గా ఉన్నవారు ఈ సినిమా చూస్తే.. ఖచ్చితంగా వైయస్ జగన్ అభిమానులు కావడం పక్కా చెప్పొచ్చు. వేరే పాత్రలతో జగన్ ఇమేజ్‌ను ఎలివేషన్ చేసేలా నాలుగైదు సీన్స్ ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ యాంగిల్‌లో చూసే వారికీ మాత్రం అంతా సెల్ఫ్ ప్రమోషన్‌లా కనిపిస్తోంది.

ఇక దర్శకుడు యాత్ర2 మూవీ ఇది కల్పితం కాదనే చెప్పే ప్రయత్నం చేయలేదు. డైరెక్ట్‌గా ఇందులోని పాత్రలు, పాత్రధారులు.. అన్ని నిజాలే.. కల్పితాలు కావు అన్నట్టు ఈ సినిమాలో చెప్పాడు. టైటిల్స్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూపిస్తేనే క్లైమాక్స్‌లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే సీన్స్‌తో ఈ సినిమాను ఎండ్ చేశాడు. ఇక వై.యస్. రాజశేఖర్ రెడ్డి.. వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఒకేకారులో ఎపుడు ప్రయాణం చేయలేదనే విషయాన్ని దర్శకుడు ప్రస్తావించాడు. ఈ సందర్భంగా జీవాతో నేను తొలిసారి మా నాన్న అంతిమ యాత్రలో కలిసి ప్రయాణం చేసిన విషయాన్ని  ఈ సినిమాలో ప్రస్తావించారు. అంతేకాదు ఈ సినిమాలో డైలాగ్స్ కూడా బాగానే పేలాయి. అందులో కేంద్రంలోని పార్టీ భయపెట్టినా.. చంద్రబాబు బలగం కలిసిన వైయస్ జగన్ సంకల్పాన్ని ఆపలేకపోకపోయానే కేవీపీ పాత్రతో చెప్పించే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

ఈ సినిమాకు సంతోష్ నారయణ్ సంగీతం పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదను పెడితే బాగుండేది. పొలిటికల్ మూవీ కాబట్టి సీరియస్‌గా సాగిపోతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటనటుల విషయానికొస్తే..
వై.యస్.రాజశేఖర్ రెడ్డిగా యాత్రలో అలరించిన మమ్ముట్టి.. యాత్ర 2లో తనదైన యాక్టింగ్‌తో మెప్పించాడు. అచ్చంగా వైయస్ ను దించేసాడు. వై.యస్. జగన్ పాత్రలో నటించిన జీవా తన  పరిధి మేరకు జగన్ హావభావాలను పలకించే ప్రయత్నం చేసాడు. అందులో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక చంద్రబాబు పాత్రలో నటించిన మహేష్ మంజ్రేకర్ జీవించాడు. సోనియా పాత్రలో యాక్ట్ చేసిన నటి అందులో జీవించింది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

ప్లస్ పాయింట్స్
 
కథ

నటీనటుల నటన

ఎమోషనల్ కమ్ ఎలివేషన్ సీన్స్  

మైనస్ పాయింట్స్

వై.యస్.జగన్మోహన్ రెడ్డి యాంగిల్‌లో సాగే కథ

ఎమోషనల్ కమ్ సీరియస్‌గా సాగడం

సెకండాఫ్ ల్యాగ్

చివరి మాట: యాత్ర 2 .. జగన్ అభిమానులను మెచ్చే ఎమోషనల్ పొలిటికల్ డ్రామా..

రేటింగ్: 3/5

ఇదీ చదవండి: Samudrika Shastra: చేతిగోళ్లపై ఈ గుర్తు ఉందా? జీవితాంతం సంపదకు లోటే ఉండదట..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News