VK Naresh Birth Day: తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మందికి అర్హత ఉన్నా కూడా పద్మ అవార్డులు లభించడం లేదని సీనియర్ నటుడు వీకే నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డుల కోసం ఎంతదాకైనా పోరాటం చేయాలని ప్రకటించారు. తన తల్లి విజయ నిర్మలకు అవార్డు ఇచ్చేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read: Manchu Manoj: మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు.. 'మా నాన్నను మంచు విష్ణు నడిపిస్తున్నాడు'
ఈనెల 20వ తేదీన తన జన్మదినం సందర్భంగా ఆదివారం నరేశ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన సినిమా ప్రస్థానంతోపాటు భవిష్యత్ సినిమా ప్రకటనలు.. తన వ్యక్తిగత జీవితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే పద్మ అవార్డులపై స్పందించారు. తెలుగు వారికి పద్మ పురస్కారాలు రావడం లేదని నరేశ్ అసహనం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు దక్కకపోవడంపై నరేశ్ స్పందిస్తూ.. ఎన్టీఆర్‌కు తప్పనిసరిగా భారతరత్న ఇవ్వాలని కోరారు. తన తల్లి విజయ నిర్మలకు కూడా పద్మ పురస్కారం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ విజయ నిర్మల అని నరేశ్ గుర్తుచేసుకున్నారు. తన తల్లికి అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు నరేశ్ వివరించారు.
Also Read: Manchu Family: 'నేను ముసలోడిని.. ఇల్లు ఖాళీ చేయించాలి' అని కలెక్టర్‌కు మోహన్ బాబు విజ్ఞప్తి
నటి, దర్శకురాలు అయిన విజయ నిర్మలకు పద్మ అవార్డు రావడం కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నించారని నరేశ్ తెలిపారు. విజయ నిర్మలకు పద్మ అవార్డు కోసం సిఫారసు చేసినట్లు నటుడు వీకే నరేశ్ గుర్తుచేసుకున్నారు. విజయ నిర్మలకు ఇప్పటివరకు పద్మ అవార్డు లభించకపోవడం బాధాకరమని వాపోయారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది అవార్డులకు అర్హత కలిగి ఉన్నారని తెలిపారు. తెలుగు వారికి పద్మ పురస్కారాలు రావాలని కోరుతూ నిరాహార దీక్ష చేసినా తప్పులేదని స్పష్టం చేశారు.
అనంతం తన సినీ ప్రస్థానం.. వ్యక్తిగత జీవితంపై వీకే నరేశ్ మాట్లాడారు. 2025లో తనవి మొత్తం 9 సినిమాలు విడుదల కానున్నట్లు ప్రకటించారు. సినిమాల్లో లీడ్ రోల్‌తోపాటు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు ఉన్నాయని.. అవన్నీ ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. వచ్చే నెలలో తన తల్లి విజయ నిర్మల జయంతి.. జంధ్యాల జయంతి కార్యక్రమాలు చేపడుతున్నట్లు నరేశ్ తెలిపారు. తన తల్లి విజయ పేరిట సినీ కార్యక్రమాలతోపాటు సేవ కార్యక్రమాలు చేపడతానని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter