Laatti Title Teaser: లాఠీ టైటిల్ టీజర్.. పోలీస్ ఆఫీసర్‌గా Vishal pan india movie

Laatti Title Teaser: ప్రస్తుతం ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ట్రెండ్ నడుస్తుండటంతో లాఠీ సినిమాను (Laatti movie) తమిళ, తెలుగు, హిందీ, మళయాళం భాషల్లో విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2021, 12:18 PM IST
Laatti Title Teaser: లాఠీ టైటిల్ టీజర్.. పోలీస్ ఆఫీసర్‌గా Vishal pan india movie

Laatti Title Teaser: విశాల్ హీరోగా నటిస్తున్న అప్‌కమింగ్ సినిమా లాఠీ టైటిల్ టీజర్ విడుదలైంది. విశాల్ కెరీర్‌లో 32వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను ఎ వినోద్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన విశాల్... ఈ సినిమాలో కూడా పోలీసు ఆఫీసర్ పాత్రలోనే కనిపించనున్నాడని టీజర్ టైటిల్ చెప్పకనే చెబుతోంది. 

రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ నంద నిర్మిస్తున్న లాఠీ మూవీలో విశాల్ సరసన సునైన జంటగా నటిస్తోంది. లాఠీ టీజర్‌కు (Laatti teaser) మ్యూజిక్ కంపోజర్ శ్యామ్ సీఎస్ ఆకట్టుకునే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. 

విశాల్ సినిమాలకు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంటుంది. దక్షిణాదినే కాకుండా హిందీలోకి డబ్ అయ్యే విశాల్ సినిమాలకు హిందీ డిజిటల్ మార్కెట్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. అందులోనూ పోలీస్ యూనిఫామ్‌లో విశాల్ (Vishal) యాక్షన్ అంటే విశాల్ అభిమానులకు ఇంకొంత క్రేజ్ ఎక్కువే ఉంటుంది. 

వీటన్నింటికి తోడు ప్రస్తుతం ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ట్రెండ్ నడుస్తుండటంతో లాఠీ సినిమాను (Laatti movie) తమిళ, తెలుగు, హిందీ, మళయాళం భాషల్లో విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది.

Trending News