Epfo Superannuation Pension New Year Gift 2025: 58 సంవత్సరాలు నిండిన ప్రతి ఉద్యోగి సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ కింద దాదాపు రూ.9 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. అంతేకాకుండా ఈ పెన్షన్ త్వరలోనే కేంద్ర పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి.
Epfo Superannuation Pension New Year Gift 2025: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 58 సంవత్సరాల ఏళ్లు నిండిన వారికి అద్భుతమైన పెన్షన్ సదుపాయాన్ని అందిస్తోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద ఖాతాదులకు ప్రత్యేకమైన పెన్షన్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ వయసు ఉన్నవారికి కూడా EPFO ప్రత్యేకమైన పెన్షన్ సదుపాయాలను అందిస్తోంది. అయితే ఈ ముందస్తు పెన్షన్ ఎలా పొందాలో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్‌ను 58 సంవత్సరాల లోపు వారు కూడా పొందవచ్చు. అయితే పెన్షన్ పొందడానికి కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ పెన్షన్ కోసం ఏదైనా సంస్థలో 10 ఏళ్లు పని చేయాల్సి ఉంటుంది.
ఈ పెన్షన్ పొందాలనుకునేవారు ముందుగానే జీతం నుంచి దాదాపు 12 శాతం వరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా యజమాని కూడా ఇలా చెల్లించాల్సి ఉంటుంది.
సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ అనేది ఉద్యోగి పని చేసే సంవత్సరాలపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం ఎక్కువ రోజుల పాటు చేసిన వారికి పెన్షన్ అధిక మొత్తం లభిస్తుందని EPFO పేర్కొంది. అంతేకాకుండా జీతంలో 12 శాతం వరకు ఖాతాలో జమ చేసిన వారికే ఈ పెన్షన్ వర్తిస్తుందని తెలిపింది.
ఈ పెన్షన్ పొందడానికి తప్పకుండా ఉద్యోగి పదవి విరమణ పొందిన తర్వాత 58 సంవత్సరాల వయస్సు నిండి ఉండాల్సి ఉంటుంది. అలాగే EPFOకి సంబంధించిన ధృవీకరణ పత్రాలను కూడా కలిగి ఉండాలి.
ఈ పెన్షన్ పొందడానికి తప్పకుండా ఉద్యోగి పదవి విరమణ పొందిన తర్వాత 58 సంవత్సరాల వయస్సు నిండి ఉండాల్సి ఉంటుంది. అలాగే EPFOకి సంబంధించిన ధృవీకరణ పత్రాలను కూడా కలిగి ఉండాలి.
సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ బేసిక్ రూ.9,000 నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొత్త సంవత్సరంలో ఈ పెన్షన్ శాతాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర త్వరలోనే వెల్లడించే ఛాన్స్ ఉంది.