vijayashanti about Sushant Singh Rajput death case: బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై ఇప్పటికే సీబీఐ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ సినీనటి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ( Vijayashanti ) తన సోషల్ మీడియా ద్వారా ఈ కేసుపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే కానీ.. మన సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆమె ట్విట్టర్ వేదికగా రాశారు. మరణించిన వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు.. దర్యాప్తులు జరిగాయా? అని ప్రశ్నించారు. Also read: Maadhavi Latha: డ్రగ్స్ మత్తులో టాలీవుడ్.. సార్లు ఓ కన్నేయండి
ఇంకా ఎం రాశారంటే.. సుశాంత్ కేసులో బయటకొస్తున్న విషయాలు చూస్తుంటే విస్మయం కలుగుతోంది. వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం. అయితే దర్యాప్తులు, విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలన్నారు. తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు తగిన ఆధారాల్ని సమర్పించిన తర్వాత కూడా.. వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి అంటూ.. విజయశాంతి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. Also read: విశాఖపట్నం వచ్చినప్పుడు కలుస్తానమ్మా: పవన్ కల్యాణ్