సీనియర్ నటుడు రావి కొండలరావు కన్నుమూత

చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత, సీనియర్ నటుడు రావి కొండలరావు (Ravi Kondala Rao Dies) గుండెపోటుతో కన్నుమూశారు. సీనియర్ నటుడి మరణం పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. 

Last Updated : Jul 28, 2020, 06:25 PM IST
సీనియర్ నటుడు రావి కొండలరావు కన్నుమూత

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత, సీనియర్ నటుడు రావి కొండలరావు(88) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి వయసురీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న సీనియర్ నటుడు గుండెపోటుతో బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Ravi Kondala Rao Dies) విడిచారు. తెలుగు చిత్రసీమకు నటుడిగా, రచయిత విశేష సేవలందించిన రావి కొండలరావు (Raavi Kondala Rao) జర్నలిస్ట్‌గానూ పలు సంస్థల్లో బాధ్యతలు నిర్వహించడం గమనార్హం. Tollywood: నటుడు కిక్ శ్యామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

1932, ఫిబ్రవ‌రి 11న శ్రీకాకుళం సామ‌ర్లకోటలో జ‌న్మించారు. 1958లో ‘శోభ’ చిత్రంతో సినీ ప్రస్థానం మొదలుపెట్టారు. ఆయన భార్య సీనియర్ రాధాకుమారి. వీరిద్దరూ జంటగా పలు సినిమాల్లో నటించారు. న‌టుడు రావి కొండ‌లరావు 6 దశాబ్ధాలుగా చిత్రసీమకు సేవలందించారు. 600కు పైగా సినిమాల్లో నటించి తన నటనతో మెప్పించారు. RGV ‘మర్డర్’ మూవీ ట్రైలర్

రావి కొండలరావు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చదువుకున్నారు. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్‌గా, విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా పని చేశారు. తన భార్య, నటి రాధాకుమారితో కలిసి వందల సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.  చేశారు. కరోనా కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రావి కొండలరావుకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆర్థిక సాయం చేయడం తెలిసిందే. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో రావి కొండలరావు  (Raavi Kondala Rao Dies At 88)మరణించారు. పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్   
నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు

Trending News