Urfi Javed : దానికి రేట్ అంతేనా?.. ఫ్యాన్స్‌తో ఉర్ఫీ జావెద్ కామెంట్స్

Urfi Javed Asks Rs 1000 For A Selfie ప్రస్తుతం తమకు నచ్చిన తారలు బయటకు వస్తే.. అభిమానులు ఊరుకోవడం లేదు. సెల్ఫీలు అంటూ చుట్టుముట్టేస్తున్నారు. ఎయిర్ పోర్టులో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2023, 04:57 PM IST
  • ఉర్ఫీ జావెద్‌ను చుట్టుముట్టిన ఫ్యాన్స్
  • సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు
  • వెయ్యి రూపాయలు అడిగిన ఉర్ఫీ జావెద్
Urfi Javed : దానికి రేట్ అంతేనా?.. ఫ్యాన్స్‌తో ఉర్ఫీ జావెద్ కామెంట్స్

Urfi Javed Asks Rs 1000 For A Selfie బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీగా ఉర్ఫీ జావెద్‌కు సోషల్ మీడియా ఓ మోస్తరు ఫాలోయింగ్ ఉంది. ఇక తన వింత వింత అవుట్ ఫిట్స్, వింత డ్రెస్సులతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంఉటంది. అలా తన వింత వింత డిజైనర్ దుస్తులే ఉర్ఫీని ఫేమస్ చేశాయి. ఎంతగా ట్రోలింగ్ అయితే అంతగా ఫేమస్ అయినట్టుగా ఉర్ఫీ భావించినట్టుంది. అందుకే ఉర్ఫీ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. అయితే తాజాగా ఇలా తన అభిమానులతో సరదాగా కనిపించింది.

ఎయిర్ పోర్టులో సింపుల్‌గా ఉర్ఫీ కనిపించింది. షార్ట్ కుర్తాతో అలా సింపుల్‌గా ఉర్ఫీ వెళ్తూ కనిపించింది. ఇక ఆమెను ఫోటో గ్రాఫర్లు క్లిక్‌మనిపిస్తూనే ఉన్నారు. అయితే ఇంతలో ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. ఫోటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అయితే ఉర్ఫీ మాత్రం వారితో ఫోటోలు, సెల్పీలు దిగుతూనే ఉంది. ఓ అభిమాని పదే పదే సెల్పీలు తీస్తుండటంతో. డబ్బులు తియ్.. వెయ్యి రూపాయలు ఇవ్వమని సరదాగా జోక్ వేసింది.

సెల్పీకి వెయ్యి రూపాయలేనా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అసలే ఉర్ఫీ జావెద్ ఫోటోలు, వీడియోలు అంటే సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉర్ఫీ ఇప్పుడు బుల్లితెర, వెండితెరపై కంటే.. సోషల్ మీడియాలోనే  ఎక్కువగా ఉంటోంది. అందాల ఆరబోతలో కొత్త కొత్త దారులను వెతుక్కుంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోంది. ఈ మధ్యే జొమాటో కార్నివాల్‌కు ఉర్ఫీ వెళ్లేందుకు ప్రయత్నిస్తే హోటల్ సిబ్బంది అడ్డగించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జొమాటో దిగి వచ్చి ఉర్ఫీకి సారీ చెప్పింది.

Also Read:  Ananya Nagalla : అనన్య తడి అందాలు.. చూస్తే వామ్మో అనాల్సిందే.. అందరి ఫోకస్ అక్కడే

బిగ్ బాస్ హిందీ ఓటీటీలో ఉర్ఫీ జావెద్ రచ్చ చేసింది. బిగ్ బాస్ ఇంట్లో ఉండగానే రకరకాల విన్యాసాలు, దుస్తులు వేస్తూ రచ్చ చేసింది. ఇక ఉర్ఫీ అంతకు ముందు సీరియల్స్‌లో నటించింది. రియాల్టీ షోలు కూడా ఉర్ఫీ చేసింది. అయితే ఉర్ఫీకి సరైన హిట్టు మాత్రం రావడం లేదు. సిల్వర్ స్క్రీన్ మీద ఉర్ఫీకి సరైన బ్రేక్ ఎప్పుడు వస్తుందా? అని ఆమె అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

Also Read:  Naga Chaitanya : పోతుందని తెలిసి కూడా ప్రమోషన్స్ చేయడం కష్టం!.. థాంక్యూపై నాగ చైతన్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News