Chaithra Rai in NTR 30: కొరటాల మాస్టర్ స్కెచ్.. బాలీవుడ్ విలన్ కి భార్యగా తెలుగు టీవీ హీరోయిన్!

Chaithra Rai Roped in NTR 30: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్ర కోసం ఒక టీవీ సీరియల్ హీరోయిన్ ను ఎంచుకున్నాడు కొరటాల శివ. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 2, 2023, 07:47 PM IST
Chaithra Rai in NTR 30: కొరటాల మాస్టర్ స్కెచ్.. బాలీవుడ్ విలన్ కి భార్యగా తెలుగు టీవీ హీరోయిన్!

TV actress Chaithra Rai in NTR 30: ఎంత కామెడీ చేసినా ఎన్ని తిట్టుకున్నా సీరియల్స్ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. తెలుగులో ఇప్పటికే జీ తెలుగు, స్టార్ మా, ఈటీవీ, జెమినీ వంటి ఛానల్స్ లో అనేక సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. ఆ సీరియల్స్ లో నటించే నటీమణులకు కూడా అటు సోషల్ మీడియాతో పాటు మహిళా మణుల్లో ఎక్కువగా పాపులారిటీ లభిస్తోంది. ఇక ఇప్పుడు ఆ పాపులారిటీ వాడుకునేందుకు ఎన్టీఆర్ 30 దర్శకుడు కొరటాల శివ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30 సినిమాని చాలా ప్లాన్డ్గా సిద్ధం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు పని చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సైఫ్ అలీఖాన్ వంటి నటుడు సినిమాలో భాగమవుతున్నాడంటే సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అలాంటి నటుడి భార్యగా మరో బాలీవుడ్ భామనో లేక పేరు ఉన్న సీనియర్ హీరోయినో తీసుకొస్తారనుకుంటే కొరటాల శివ ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. అదేమంటే కన్నడ టీవీ పరిశ్రమకు చెందిన చైత్ర రాయ్ అనే భామను సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటింప చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Puvvada Ajay Met Jr NTR: ఎన్టీఆర్ ఇంటికి తెలంగాణ మంత్రి.. ఆరోజు షాక్ ఇస్తారా?

ఈ చైత్ర రాయ్ కన్నడ నటి అయినా సరే తెలుగులో టీవీ నటిగా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఈ మధ్యనే ఈ భామ ఎన్టీఆర్ 30 సినిమా సైన్ చేయడమే కాదు ఆ సినిమా సెట్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో ఈ చైత్ర నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  నిజానికి ఈ భామ రాధకు  నీవే ప్రాణం అనే ఒక కన్నడ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తెలుగులో ఒకప్పుడు సూపర్ హిట్ గా నిలిచిన అష్టాచమ్మా అనే సినిమాలో కూడా ఆమె మెయిన్ లీడ్ గా నటించింది.

అలాంటి భామను ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో తీసుకోబోతున్నారు అంటే దీని వెనుక కొరటాల శివ మాస్టర్ ప్లాన్ ఉందనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగానే సీరియల్ నటీమణులు అన్నా నటులు అన్నా సీరియల్స్ ఎక్కువగా ఫాలో అయ్యే లేడీస్ అందరికీ మంచి కనెక్టివిటీ ఉంటుంది. అలాంటి వారు నటించిన సినిమాలు కూడా మంచి హిట్లుగా నిలుస్తూ వస్తున్నాయి. లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో లేడీస్ ఐనా సినిమాలకు వస్తారనే ఒక ఆశ ఉండడంతో ఇలా టీవీ నటీనటులను సినిమాల్లో భాగంగా నటింప చేస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన విరూపాక్ష సినిమాలో కూడా రవికృష్ణని ఒక ప్రధాన పాత్రలో తీసుకున్నారు.

ఇప్పుడు చైత్ర రాయ్ ని కూడా అదే బాటలో ఈ సినిమాలో భాగమైందని అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి తర్వాతి సినిమా కావడంతో ఈ సినిమా మీద అందరికీ ఎంత అంచనాలు ఉన్నాయో అన్ని భయాలు ఉన్నాయి. ఈ నేపద్యంలో సినిమాకి అవసరమైన అంత పాడింగ్ యాడ్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. చైత్ర రాయ్ సినిమాలో భాగమైతే లేడీస్ అందరూ సినిమా చూడడానికి ఆసక్తి చూపించడమే కాదు కన్నడ సినీ పరిశ్రమ నుంచి కూడా ఈ భామ వల్ల కొంత ఆసక్తి ఏర్పడే అవకాశం ఉంది. సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ మేరకు కొరటాల శివ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

Also Read: Chandrababu Calls Rajinikanth: రజనీకాంత్ కి బాబు ఫోన్.. అభయమిచ్చిన తలైవా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News