Tunisha Suicide Case: యువ నటి తునీషా ఆత్మహత్య కేసులో కీలక పరిణామం, షీజాన్ అరెస్టు

Tunisha Suicide Case: బాలీవుడ్ షూటింగ్ ప్రాంతంలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో సహ నటుడు షీజాన్ మొహమ్మద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 25, 2022, 12:27 AM IST
Tunisha Suicide Case: యువ నటి తునీషా ఆత్మహత్య కేసులో కీలక పరిణామం, షీజాన్ అరెస్టు

బాలీవుడ్ షూటింగ్ సెట్‌లో 20 ఏళ్ల తునిషా శర్మ ఆత్మహత్య  సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఈ కేసులో ఆమె సహ నటుడు షీజాన్ మొహమ్మద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. 

20 ఏళ్ల పిన్న వయస్సులోనే తునిషా శర్మ తనువు చాలించింది. ఓ మ్యూజిక్ షూటింగ్‌లో పాల్గొన్న తునిషా అదే స్పాట్‌లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. కాస్సేపట్లో షూట్ ఉందనగా తునిషా స్పృహ లేని స్థితిలో కన్పించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.  వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా..ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఫితూర్, దబాంగ్ 2, బార్ బార్ దేఖో కహానీ 2 చిత్రాల్లో నటించిన తునిషా ఆత్మహత్య వెనుక సహ నటుడు షీజాన్ మొహమ్మద్ ప్రమేయముందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

సెక్షన్ 306 కింద ఆత్మహత్యకు ప్రేరేపించాడనే కారణంతో పోలీసులు షీజాన్ మొహమ్మద్‌పై ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్టు చేశారు. అతనిని వాసై కోర్టులో హాజరుపర్చనున్నారు. కొద్దికాలం తునిషా శర్మ షీజాన్‌తో రిలేషన్‌లో ఉందని తెలుస్తోంది. షీజాన్ బ్రేకప్ చెప్పడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. 

Also read; Avatar 2 OTT Release: అవతార్ 2 ఓటీటీ విడుదలపై అప్‌డేట్, స్ట్రీమింగ్ ఎప్పుడు , ఎందులోనో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News