Trisha Krishnan Clarity: కాంగ్రెస్ లోకి త్రిష అంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పేసిన త్రిష!

Trisha Krishnan Clarity on Joining Congress Party: త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రంగి ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చింది, దీంతో చాలా పుకార్లకు బ్రేకులు వేసినట్టు అయింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 26, 2022, 11:24 AM IST
Trisha Krishnan Clarity: కాంగ్రెస్ లోకి త్రిష అంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పేసిన త్రిష!

Trisha Krishnan Clarity on Joining Congress Party: తమిళనాడులో జన్మించిన త్రిష కృష్ణన్ తమిళ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనేక సినిమాల ద్వారా మంచి క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత తెలుగు, మలయాళ, హిందీ సినీ పరిశ్రమల్లో కూడా హీరోయిన్ గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి ముందుగా త్రిష మిస్ చెన్నై కాంటెస్ట్ లో గెలిచిన తర్వాత ఆమె సినీ పరిశ్రమలో ఎంట్రీ వచ్చింది.

తమిళంలో జోడి అనే సినిమాలో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గా మారి అనేక సినిమాల్లో నటించింది. తమిళంలో ఎనక్కు 20 ఉనక్కు 18 అనే సినిమాని తెలుగులో నీ మనసు నాకు తెలుసు పేరుతో రిలీజ్ చేశారు అదే ఆమెకు మొట్టమొదటి టాలీవుడ్ మూవీ అని చెప్పచ్చు. ఇక అదే ఏడాది వర్షం అనే సినిమాలో శైలజా పాత్రలో చేసిన నటనకు గాను ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కించుకోగా అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకునే పనే పడలేదు.

అలా త్రిష తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, అల్లరి బుల్లోడు, పౌర్ణమి, బంగారం, ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే, కృష్ణ, బుజ్జిగాడు, శంఖం, నమో వెంకటేశా, ఏం మాయ చేసావే, తీన్మార్, బాడీగార్డ్, దమ్ము, లయన్, చీకటి రాజ్యం, నాయకి వంటి సినిమాల్లో నటించింది. నాయకి తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో కనిపించలేదు కానీ ఆమె తమిళంలో రంగి అనే సినిమాలో నటిస్తోంది.

ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉంది. అయితే త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, తమిళనాట పార్టీని బలపరుచుకునే ఉద్దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆమె కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.

ఇప్పటికే అదేమీ లేదని త్రిష తల్లి ఉమా కృష్ణన్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఇదే అంశం మీద త్రిష కూడా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని త్రిష  వెల్లడించారు. తనకు ఇప్పుడు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదన్న త్రిషసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు కేవలం ప్రచారమే అని అది నిజం కాదని ఆమె పేర్కొన్నారు. 

Also Read: తల్లి కాబోతున్న తునీషా శర్మ?.. పోస్ట్ మార్టం రిపోర్టులో అన్ని విషయాలపై క్లారిటీ!

Also Read: Dhamaka: మొదటి రోజు కంటే మూడో రోజే ఎక్కువ వసూళ్లు.. 'ధమాకా' లెక్క మాములుగా లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 

Trending News