Trisha: మరోసారి త్రిషకి వరుస అవకాశాలు.. ఏకంగా అరడజన్ సినిమాలు!!

Trisha Krishnan: నాలుగైదు సినిమాలు చేస్తేనే హీరోయిన్లు పాతబడిపోతున్న ఈ టైంలో ..రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఇప్పటికీ తన ఖాతాలో లెక్కలేనని ఆఫర్లు ఫిక్స్ చేసుకుంది వర్షం బ్యూటీ. సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన ఈ బ్యూటీ సాలిడ్ గా ఫిక్స్ చేసిన ఆ మూవీస్ లిస్ట్ ఏమిటో చూసేద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2024, 12:35 PM IST
Trisha: మరోసారి త్రిషకి వరుస అవకాశాలు.. ఏకంగా అరడజన్ సినిమాలు!!

Trisha-Chiranjeevi: గత రెండు దశాబ్దాలు గా తెలుగు సినీ ఇండస్ట్రీ తో పాటు తమిళ్ ..హిందీలో కూడా తన ప్రతిభ కనబరిచిన హీరోయిన్ త్రిష. కొంతకాలం కెరీర్ కు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీతో మరొకసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఐశ్వర్యారాయ్ కి ధీటుగా నటించి త్రిష ఈ చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ మూవీ తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రీసెంట్ గా లియో చిత్రంలో విజయ్ సరసన పిల్లల తల్లిగా ఇచ్చిన సరే.. ఆమె గ్లామర్ తగ్గనే లేదు అని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో త్రిష లియో తర్వాత వరసగా ఆఫర్లు అందుకుంటుంది.

తాజాగా 18 సంవత్సరాల గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ మెగాస్టార్ చిరంజీవి పక్కన త్రిష విశ్వంభర మూవీలో నటించడాన్ని అధికారికంగా వెల్లడించారు సినిమా మేకర్స్. త్రిష నిన్ననే ఈ సినిమా షూటింగ్ కి వచ్చిన వీడియో కూడా చిరంజీవి షేర్ చేశారు. స్టాలిన్ మూవీ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇదే. మరోపక్క పంజా డైరెక్టర్ విష్ణువర్ధన్ సల్మాన్ చిత్రంలో కూడా హీరోయిన్ గా త్రిషనే నటిస్తోంది. 

మొదట్లో ఈ మూవీకి హీరోయిన్ గా సమంత అని అనుకున్నారు కానీ.. సడెన్ గా సామ్ సైడ్ అవ్వడం తో ఆ ప్లేస్ త్రిషకి కన్ఫర్మ్ అయింది. ఇక విదా ముయార్చి అని తమిళ్ మూవీ లో అజిత్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది త్రిష. మలయాళం లో సూపర్ క్రేజీ కాంబో గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ – జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న రామ చిత్రంలో కూడా మెయిన్ లీడ్ గా త్రిష నటిస్తోంది.

లోక నాయకుడు కమల్ హాసన్ మణిరత్నం క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా త్రిష ఛాన్స్ కొట్టేసింది. వీటితోపాటు నిర్మాణంలో ఉన్న ఐడెంటిటీ అనే మరో చిత్రంలో కూడా త్రిష నటిస్తోంది. కుర్ర హీరోయిన్ల కంటే యమ బిజీగా త్రిష వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లెక్కలు బట్టి మరొక రెండేళ్ల వరకు కాల్ షీట్స్ దొరికే ప్రసక్తి లేదు. మరోపక్క ఇప్పటివరకు బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న త్రిష పెళ్లి ఊసత్తితే ఆ మాటను దాటేస్తుంది.

Also Read: Raw Cat Eat: దేశంలో ఇంకా ఆకలి కేకలా.. దేశాన్ని నివ్వెరపరిచిన 'పిల్లిని తిన్న యువకుడు' సంఘటన

Also Read: UBI Recruitment: అదిరిపోయే ఉద్యోగం.. ఈ జాబ్‌కు ఎంపికైతే తొలి జీతమే రూ.90 వేలు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News