Tollywood Heroine: ఇదేందయ్యా ఇదీ.. లేడీ టెక్నీషియన్ తో ప్రేమలో పడిన టాలీవుడ్ హీరోయిన్

Heroine in Love with a Lady technician: తెలుగు సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ మరో లేడీ టెక్నీషియన్ తో ప్రేమలో పడినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 15, 2022, 09:54 PM IST
Tollywood Heroine: ఇదేందయ్యా ఇదీ.. లేడీ టెక్నీషియన్ తో ప్రేమలో పడిన టాలీవుడ్ హీరోయిన్

Tollywood Heroine in Love with a Lady technician: సినీ పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలకు ఏ మాత్రం తక్కువ లేదు. చాలా మంది హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులు కొంతమంది టెక్నీషియన్ లను లేదా తమ సహచర నటీనటులను ప్రేమించి పెళ్లి చేసుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇక వీరు ప్రేమించకుండానే ప్రేమించుకుంటున్నారు అంటూ అనేక పుకార్లు కూడా తెరమీదకు వస్తూ ఉంటాయి.

సినీ పరిశ్రమ గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి అందులో ఉన్న వారు కూడా పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోరు. కానీ ఎప్పటికప్పుడు హీరో హీరోయిన్లు మధ్య ఎఫైర్లు ఉన్నాయని లేదా హీరోయిన్లు వేరే వ్యాపార వేత్తతో ప్రేమలో పడిందని ఇలా పుకార్లు తెరమీదకు వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ ప్రేమలో పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. అది కూడా తన దగ్గర పనిచేసే ఒక టెక్నీషియన్ తో అని అంటున్నారు.

అయితే ఇలా ప్రేమలో పడడం వింత ఏమి కాదు కానీ ఆమె ప్రేమలో పడింది మరో లేడీ టెక్నీషియన్ తో అని టాక్ వినిపిస్తోంది. అదే ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అవుతోంది. ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి, తెలుగులో మంచి సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఒక భామ తన దగ్గర పనిచేస్తున్న ఒక లేడీ టెక్నీషియన్ ప్రేమలో పడిందట.

వీరిద్దరూ కలిసి దాదాపుగా లివింగ్ రిలేషన్లో ఉన్నట్లుగా కలిసిపోయి మరీ కనిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ కి ఎంత క్రేజ్ ఉందో టెక్నీషియన్ కి కూడా అంతే క్రేజ్ ఉందట, ఇద్దరూ కలిసి కొన్ని సినిమాలు చేశారని దీంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని అంటున్నారు. ఇద్దరికీ పెళ్లి కాకపోవడంతో ఇద్దరు కలిసి చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారని ప్రచారం అయితే ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది.

అయితే సాధారణంగా పుట్టుకొచ్చే పుకార్ల లాగానే ఇది కూడా పుకారేనా లేక నిజంగానే వారిద్దరి మధ్య ఏదైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది. వాస్తవానికి భారతదేశంలో ఎవరు ఎవరితో అయినా కలిసి నివసించే హక్కు కల్పించారు. అయితే సెలబ్రిటీలు కాబట్టి ఒకవేళ వారి రిలేషన్ నిజమే అయినా దాన్ని అధికారికంగా ప్రకటించుకునే ధైర్యం అయితే చేయకపోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. 

Also Read: NTR - Ram Charan: ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు అరుదైన గౌరవం.. టాలీవుడ్ లో మరెవెరూ దరిదాపుల్లో కూడా లేకుండా!

Also Read: Pawan Kalyan at Unstoppable: అన్ స్టాపబుల్ కు పవన్ గ్రీన్ సిగ్నల్.. ఎపిసోడ్ వచ్చేది అప్పుడే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News