Tillu Square: టిల్లు స్క్వేర్ కి కొత్త రిలీజ్ డేట్.. వెనక్కి తగ్గాడుగా!

Tillu Square New Release Date: డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ ఆయనే స్వయంగా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ డేట్ మళ్ళీ మారింది.  

Written by - Chaganti Bhargav | Last Updated : Jun 5, 2023, 06:42 PM IST
Tillu Square: టిల్లు స్క్వేర్ కి కొత్త రిలీజ్ డేట్.. వెనక్కి తగ్గాడుగా!

Tillu Square locks its new date:  డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. నేహా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే  మంచి హిట్ అయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ హిట్ అందుకున్న ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించగా మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చి సిద్దు జొన్నలగడ్డకు కూడా మంచి పేరు తీసుకొచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సీక్వెల్  తెరకెక్కిస్తామని అప్పట్లోనే ప్రకటించారు. ప్రకటించిన విధంగానే చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభించారు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఆయనే స్వయంగా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ టిల్లు స్క్వేర్ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయం మీద క్లారిటీ లేదు.

Also Read: Shaitan Web Series: వణుకు పుట్టిస్తున్న సైతాన్ ట్రైలర్...ఛీ.. అవేం బూతులురా బాబూ! 

ఈ సినిమాని ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించారు కానీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. టిల్లు స్క్వేర్ సినిమాని థియేటర్లలో సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ మన ఫేవరెట్ టిల్లు స్క్వేర్ థియేటర్లలో పెద్ద పార్టీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. 15వ తేదీ 2023 సెప్టెంబర్ నెలలో టిల్లు స్క్వేర్ ఒక మంచి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ రాసుకొచ్చారు.

ఈ టిల్లు స్క్వేర్ సినిమాని నాగవంశీ, సాయి సౌజన్య సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయింది. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ ఇద్దరూ కూడా కారులో కూర్చుని లిప్ కిస్ ఇచ్చుకుంటున్న ఫోటోని ఒక పోస్టర్ గా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాని మల్లిక్ రాం డైరెక్ట్ చేస్తూ ఉండగా సిద్దు జొన్నలగడ్డ స్క్రిప్ట్ అందించినట్లుగా తెలుస్తోంది. మొదటి సినిమాకి కూడా ఇలాగే సిద్దు జొన్నలగడ్డ స్క్రిప్ట్ అందించడం గమనార్హం.

Also Read: Dil Raju: ఆదిపురుష్ నుంచి దూరం జరిగిన దిల్ రాజు.. అసలు ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News