Theppa Samudram : భగవద్గీత ఒక మత గ్రంథం కాదు.. ఇంట్రెస్టింగ్‌గా పోస్టర్

Theppa Samudram Movie Poster తెప్ప సముద్రం సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను మహా శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేశారు. ఇందులో భగవద్గీత, మహా భారతంల మీద కామెంట్ చేసినట్టుగా కనిపిస్తోంది. మహా భారతంలో భగవద్గీత ఓ భాగం కాదట.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 05:29 PM IST
  • మహా శివరాత్రి స్పెషల్ పోస్టర్
  • భగవద్గీత, గీతలపై కామెంట్స్
  • తెప్ప సముద్రంలో అర్జున్ అంబటి
Theppa Samudram : భగవద్గీత ఒక మత గ్రంథం కాదు.. ఇంట్రెస్టింగ్‌గా పోస్టర్

Theppa Samudram Movie Poster చిన్న సినిమాలు జనాల దృష్టిని ఆకర్షించడం అంటే మామూలు విషయం కాదు. ప్రమోషన్స్‌ను ఎంత వినూత్నంగా చేపడితే ఆడియెన్స్‌ను అంతగా రీచ్ అయ్యే అవకాశాలుంటాయి. ముందుగా సినిమా కంటెంట్‌ ఏంటో జనాలకు అర్థం అయ్యేలా చెప్పాల్సి ఉంటుంది మేకర్లు. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా సినిమాలోని కంటెంట్‌ను కొంచెం కొంచెం రివీల్ చేసుకుంటూ ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలోనే తెప్ప సముద్రం అనే సినిమా యూనిట్ మహా శివరాత్రి సందర్భంగా అప్డేట్ ఇచ్చారు.

బుల్లితెరపై సీరియల్స్‌తో హీరోగా పరిచయమైన అర్జున్‌ అంబటి ఇప్పుడు వెండితెరపైనా వరుసగా సినిమాలు  చేస్తున్నాడు. 30 వెడ్స్ 21 అనే వెబ్ సిరీస్‌తో చైతన్య రావు కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ఇక ఈ ఇద్దరూ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం తెప్ప సముద్రం. మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సతీష్‌ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. 

శ్రీమణి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నీరుకంటి మంజుల రాఘవేందర్‌ గౌడ్‌ ఈ సినిమాను బేబి వైష్ణవి సమర్పణలో  నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కొరమీను ఫేమ్‌ కిశోరి ధాత్రక్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక త్వరలోనే మంగ్లీ పాడిన మాస్‌ బీట్‌ సాంగ్‌ను విడుదల చేయబోతోన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఆ పోస్టర్ చూస్తుంటే అది కోర్ట్ రూమో లేక లాయర్ గదిలానో, లైబ్రరీలానో కనిపిస్తోంది. అయితే టేబులో వెనకాల నిలబడిన ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. 

ఇక అక్కడే భగవద్గీత కూడా కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో సీరియస్ నోట్‌లోనే సినిమా సాగేట్టుంది. ఇక పోస్టర్ మీద రాసి ఉన్న.. భగవద్గీత మహాభారతంలో ఒక భాగం కాదు.. మహాభారతమే భగవద్గీతలో ఒక భాగం.. భగవద్గీత ఒక మత గ్రంథం కాదు.. మనిషి గ్రంథం అనే కొటేషన్ చూస్తుంటే సినిమా నేపథ్యం ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Also Read:  vinaro bhagyamu vishnu katha Review : వినరో భాగ్యము విష్ణు కథ రివ్యూ.. కిరణ్ అబ్బవరం పాస్ అయ్యాడోచ్

Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News