Thalakona Pre Release Event: ఘనంగా అప్సర రాణి 'తలకోన' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఈ నెల 29న విడుదల..

Thalakona Pre Release Event: అప్సర రాణి లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ 'తలకోన'. అక్షర క్రియేషన్ పతాకంపై  నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు.  దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.

Last Updated : Mar 22, 2024, 03:51 PM IST
Thalakona Pre Release Event: ఘనంగా అప్సర రాణి 'తలకోన' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఈ నెల 29న విడుదల..

Thalakona Pre Release Event: అప్సర రాణి ప్రధాన పాత్రలో  రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ "తలకోన". ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమా ఈ నెల 29న ఆడియన్స్ ముందకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫిల్మ్ ఛాంబర్ లో ప్రి రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా  రామసత్యనారాయణ, సాయి వెంకట్, Ds రావు వంటి ఫేమస్ ప్రొడ్యూసర్స్ హాజరయ్యారు. మరోవైపు హీరో రమాకాంత్   డిస్ట్రిబ్యూటర్ పార్ధు రెడ్డి తదితరులు ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసి చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియచేశారు.

ఈ  సందర్భంగా చిత్ర  నిర్మాత శ్రీదర్ రెడ్డి మాట్లాడుతూ.. మా  హీరోయిన్  అప్సర రాణీ చేసి వెరైటీ సబెక్ట్ ఇది. ఈమె కెరీర్‌లో ఇదో మైల్ స్టోన్ మూవీలా నిలుస్తుందన్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథాంశం మొత్తం తలకోన ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో  ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా వుంటుందనే విషయాన్ని ఈ సినిమాలో  చూపించాం. అదే విధంగా ఈ సినిమాలో రాజకీయాలను, మీడియా సమాజాంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందనే విషయాన్ని చెప్పామన్నారు. అందుకు తగ్గ టీమ్ ను, టెక్నికల్ టీమ్ కూడా సినిమాకు తీసుకోవడం జరిగింది.  అలాగే థ్రిల్లింగ్  సస్పెన్స్ తో మార్చి  29న ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ప్రేక్షకులకు ఖచ్చితంగా మా సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాము.   
 

దర్శకుడు నగేష్ నారదాసి  మాట్లాడుతూ.. అప్సర రాణీ నీ  చూస్తే కాశ్మీర్ యాపిల్ పండులా కనిపిస్తుంది.కానీ ఈ సినిమాలో  తను గుంటూరు మిర్చిలా నటించింది. రెగ్యులర్ స్టోరీలా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న చిత్రం ఇది. షూటింగ్ "తలకొనలో అద్భుతంగా చేసాము. మా సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. మా  లాంటి చిన్న సినిమాలకు  సరైన షోస్ ఇచ్చి సినిమాలను బ్రతికించాలని ఈ సందర్భంగా  నేను కోరుకుంటున్నాను.

హీరోయిన్ అప్సర రాణీ మాట్లాడుతూ"నా కెరీర్ లో ఈ చిత్రం డెఫినెట్ గా ఓ మైలుస్టోన్‌లా నిలవడం ఖాయం అనే విశ్వాసం వ్యక్తం చేసింది. నేనింతవరకు చేయని ఫైట్స్ ఈ చిత్రంలో చేయడం జరిగింది. మాస్ & క్లాస్ ఆడియన్స్ కు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ సినిమాలో అప్సరా రాణితో పాటు  అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్, రంగ రాజన్, రాజా రాయ్  యోగి కత్రి తదితరులు నటించారు.
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నగేష్ నారదాసి, నిర్మాత:  దేవర శ్రీధర్ రెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాశింశెట్టి వీరబాబు, నిర్వహణ: పరిటాల  రాంబాబు, డిఓపి: ప్రసాద్, ఎడిటర్: ఆవుల వెంకటేష్
మ్యూజిక్: సుభాష్ ఆనంద్, ఫైట్స్: విన్ చిన్ అంజి, డాన్స్: చార్లీ సమకూర్చారు.

Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌

Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్‌ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News