Family Star OTT: ఓటీటీలోకి రానున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడు.. ఎక్కడంటే!

Family Star OTT Details: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న విడుదల అయ్యి డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో అప్పుడే ఈ చిత్రం ఓటీటీ వివరాలు బయట హల చల్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి..

Last Updated : Apr 14, 2024, 05:08 PM IST
Family Star OTT: ఓటీటీలోకి రానున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడు.. ఎక్కడంటే!

Family Star OTT Date: విజయ్ దేవరకొండ కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా గీత గోవిందం. అర్జున్ రెడ్డి తో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండని ఫ్యామిలీ ఆడియన్స్ కి  సైతం ఈ సినిమా దగ్గర చేసింది. పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించి గొప్ప కలెక్షన్స్ కూడా తెచ్చి పెట్టుకుంది..

కాగా ఈ సినిమా తరువాత గీతాగోవిందం 2 సినిమా కూడా రానుంది అని వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టే విజయ్ దేవరకొండ పరశురామ్ తో సినిమాని ప్రకటించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ చిత్రం అల్లు అరవింద్ చేతుల నుంచి దిల్ రాజు చేతులకు వెళ్ళింది. ఇక గీతా గోవిందం 2 కాస్త ఫ్యామిలీ స్టార్ గా మారింది. అయినా కానీ పరశురాం.. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈ చిత్రంపై విరుదలకు ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రేక్షకుల అంచనాలు తారుమారు చేస్తూ ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ గా నిలిచింది. ఏప్రిల్ 5న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

దానికి తోడు టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ దగ్గర హవా చూపిస్తూ ఉండడంతో ఈ సినిమాకి మినిమం కలెక్షన్స్ కూడా రావడం లేదు. ఈ క్రమంలో అప్పుడే ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేయనుంది అనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

అసలు విషయానికి వస్తే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. వారు ఈ చిత్రాన్ని నెలలోపలే స్ట్రీమింగ్ చెయ్యడానికి ఒప్పందం చేసుకున్నట్టు వినికిరి. ఇక థియేటర్స్ లో కూడా హవా చూపిస్తుండగా పోవడంతో ఈ చిత్రం మే 3 నుంచి తెలుగుతో తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమ్ చేయనున్నారట. త్వరలోనే ఈ డేట్ ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యనుంది అని తెలుస్తోంది. 
మరి థియేటర్స్ లో అస్సలు హగా చూపించండి కనీసం ఓటీటీలో అన్న ఫ్యామిలీస్ని ఆకర్షిస్తుందా లేదా అన్న విషయం తెలియాలి అంటే వచ్చే నెల వరకు వేచి చూడాల్సిందే.

Also Read: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..

Also Read: ఖమ్మం పాలిటిక్స్ లో కీలక పరిణామం.. భట్టి, తుమ్మల ఏకమై.. పొంగులేటికి చెక్..?

 

 

 

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News