Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!

Telugu Movies Releasing this week: ఈ వారం పలు తెలుగు సినిమాలు తెలుగు సినీ అభిమానులను అలరించనున్నాయి. ఏయే సినిమాలు థియేటర్లో అలాగే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి అనేది పరిశీలిస్తే 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 12, 2022, 04:27 PM IST
Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!

Telugu Movies Releasing this week: పెద్ద సినిమాలన్నీ విడుదల కావడంతో చిన్న సినిమాలన్నీ ఇప్పుడు రిలీజ్ కోసం క్యూ పడుతున్నాయి. ఇక ఈ వారం కూడా పలు చిన్న సినిమాలు తెలుగు వెండి తార మీ సందడి చేయబోతున్నా యి. ఈ వారం ముఖ్యంగా మూడు సినిమాల మీద మంచి బజ్ ఏర్పడింది. సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా సెప్టెంబర్ 16వ తేదీన విడుదల కాబోతోంది.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు అయ్యే విధంగా ట్రైలర్ టీజర్ ఉండడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అలాగే కిరణ్ అబ్బవరం హీరోగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే సినిమా కూడా సెప్టెంబర్ 16వ తేదీ విడుదలవుతోంది. శ్రీధర్ గదే దర్శకత్వంలో ఈ సినిమాను కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి తన సొంత నిర్మాణ సంస్థ నిర్మాణంలో నిర్మించారు.

సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా ఒక వారం వెనక్కి వెళ్ళింది. ఈ సినిమా ట్రైలర్ టీజర్ కూడా సినిమా మీద అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇక ఈ రెండు సినిమాలు కాకుండా షాకినీ డాకిని అనే సినిమా కూడా 16వ తేదీ విడుదలవుతోంది. నివేదా థామస్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమాను డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి సునీత తాటి అనే నిర్మాత ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా ట్రైలర్ కూడా సినిమా మీద అంచనాలు ఏర్పడేలా చేసింది. అలాగే కన్నడ డబ్బింగ్ కే3 కోటికొక్కడు కూడా అదే రోజున విడుదల అవుతోంది. అలాగే బిగ్ బాస్ సన్నీ హీరోగా నటించిన సకల గుణాభిరామ కూడా అదే రోజున విడుదలవుతోంది. ఇక ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల విషయానికి వస్తే ఈ వారం రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా సెప్టెంబర్ 15వ తేదీన సోనీ లివ్ లో విడుదలవుతుంది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
Also Read: Prabhas Brother Prabodh: కృష్ణంరాజు పార్ధివ దేహానికి ప్రభాస్ తలకొరివి పెట్టడం లేదు.. పెట్టేది ఎవరంటే?

Also Read: Brahmastra collections: సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతున్న బ్రహ్మాస్త్రం..ఎన్ని కోట్లంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News