Teja Sajja Viral Post: ప్రముఖ బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ తాజాగా హనుమాన్ సినిమా హీరో పై ప్రశంసలు కురిపించడం కొత్త అనుమానాలకు దారితీస్తోంది. హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో గొడవలు ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు సడన్గా ఆ సినిమా హీరో పై ప్రశంసలు కురిపిస్తుండడంతో రణవీర్.. ఆలోచనలలో ఏదో తేడా ఉంది అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
అసలు విషయంలోకెళితే, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ 2 నుంచి రన్వీర్ ను తన సినిమాలో భాగం చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య అనుకోకుండా విభేదాలు రావడంతో సినిమా నుంచి తప్పుకున్నారు రన్వీర్. కానీ ఆ సినిమా హీరో తేజ పై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇకపోతే తాజాగా తేజ సజ్జ బాలీవుడ్ హీరో రణవీర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. హనుమాన్ సినిమాతో మంచి సూపర్ హిట్ విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు తేజ. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాదు ఈ.. సినిమాలో తేజ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.
అయితే ఎంతమంది తనపై ప్రశంసలు కురిపించినా.. తనకు మాత్రం బాలీవుడ్ హీరో రణవీర్ ప్రశంస ప్రత్యేకమని తేజ తెలిపారు. అందులో భాగంగానే ఆయనతో దిగిన ఫోటోని పంచుకుంటూ.. ఇలా ఒక పోస్ట్ షేర్ చేశారు. 2024 చివరికి వచ్చింది. ఏడాది నేను అందుకున్న గొప్ప ప్రశంస రణబీర్ అందించిన ప్రశంస. ఎంతో పర్సనల్గా అనిపించింది. అందుకే ఇన్ని రోజులు ఎవరికి చెప్పకుండా మనసులోనే దాచుకున్నాను.
నా పనితనం గురించి ఆయన మాట్లాడిన విధానం నన్ను ఆకట్టుకుంది. ఆయన నాపై ప్రేమ కురిపించారు. చిన్న విషయాలను కూడా గమనించి ప్రోత్సహించారు. అది మనసులో నుంచి వచ్చినది అంటూ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. మొత్తానికి అయితే ఆ సినిమా డైరెక్టర్ తో గొడవపడ్డ రన్వీర్ ఇప్పుడు అదే సినిమా హీరో పై ప్రశంసలు కురిపించడంతో పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై రన్వీర్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
ఇదీ చదవండి: Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..
ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter