Tamannaah's remuneration: నితిన్ సినిమా కోసం తమన్నా పారితోషికం

Tamannaah remuneration for Andhadhun Telugu remake: బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అంధాధున్ మూవీని ( Andhadhun movie ) నితిన్ తెలుగు రీమేక్‌ చేసేందుకు ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Last Updated : Sep 22, 2020, 12:05 AM IST
Tamannaah's remuneration: నితిన్ సినిమా కోసం తమన్నా పారితోషికం

Tamannaah remuneration for Andhadhun Telugu remake: బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అంధాధున్ మూవీని ( Andhadhun movie ) నితిన్ తెలుగు రీమేక్‌ చేసేందుకు ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus ) కారణంగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగిపోగా ఈ సినిమాలో టబు పాత్రలో హీరోయిన్ కోసం చాలా కాలంగా వేట సాగించిన మేకర్స్.. చివరిగా తమన్నాను ( Tamannaah ) ఆ నెగటివ్ రోల్ కోసం తీసుకున్నారు. రాధిక ఆప్టే ( Actress Radhika Apte ) పాత్రలో నభా నటేష్ చేయబోతుందని ఇటీవల ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.  

ఈ చిత్రానికి తమన్నా ఎంత వసూలు చేస్తుందో తెలుసా? టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రానికిగాను తమన్నాకు రూ. 1.5 కోట్లు పారితోషికంగా చెల్లిస్తున్నారట. గతంలో నయనతార, రమ్యకృష్ణలను ఈ పాత్ర కోసం సంప్రదించగా, వారు తిరస్కరించినట్లు తెలుస్తోంది. Also read : Singeetam Srinivasa Rao: ప్రభాస్ సినిమాను గైడ్ చేయనున్న సింగీతం శ్రీనివాస రావు

టబు ( Actress Tabu ) చేసిన పాత్రకు తెలుగు రీమేక్‌లో తమన్నా న్యాయం చేయగలదని ఈ చిత్ర నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈ పాత్ర కోసం తమన్నాకి భారీ రెమ్యునరేషన్ చెల్లించడానికి వారు సిద్ధపడినట్టు ఫిలింనగర్ టాక్.

ఇంకా ఈ సినిమాకి పేరు ఖరారు కాలేదు. ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ డైరెక్ట్ ( Merlapaka Gandhi ) చేయనున్న ఈ సినిమా నవంబర్‌లో ఈ సెట్స్‌పైకి వెళ్లనుంది. 

ఇక నితిన్ ( Nithin ) ప్రస్తుతం చేస్తున్న సినిమా విషయానికొస్తే.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న రంగ్ దే మూవీ ( Rang De movie ) షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత సూర్యదేవర నాగవంశి భావిస్తున్నప్పటికీ.. డిజిటల్ రైట్స్‌కి భారీ ధర పలికితే అంతకంటే ముందుగానే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ ( Keerty Suresh ) జంటగా నటిస్తోంది. Also read : Nishabdham Trailer: అంచనాలు పెంచేస్తోన్న ‘నిశ్శబ్దం’ ట్రైలర్

Trending News