Sushanth's look in Ravanasura : రవితేజ రావణాసుర మూవీ నుంచి సుశాంత్ లుక్‌.. ఆ క్యారెక్టర్‌‌లో సుశాంత్!

Sushanth's first look from Ravi Teja's Ravanasura Movie : ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో జెట్‌ స్పీడ్‌ దూసుకెళ్తోన్నాడు రవితేజ. బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్‌మెంట్స్‌ ఇస్తున్నాడు. వరుసగా సినిమాలు లైన్‌లో పెట్టాడు. తాజాగా రవితేజ రావణాసుర మూవీ నుంచి.. సుశాంత్ లుక్‌ వచ్చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2022, 08:06 PM IST
  • రవితేజ రావణాసుర మూవీ నుంచి అప్‌డేట్
  • సుశాంత్ లుక్‌ను రిలీజ్ చేసిన మూవీ మేకర్స్
  • సరి కొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న సుశాంత్
Sushanth's look in Ravanasura : రవితేజ రావణాసుర మూవీ నుంచి సుశాంత్ లుక్‌.. ఆ క్యారెక్టర్‌‌లో సుశాంత్!

Sushanth's first look from Ravi Teja's Ravanasura Movie : క్రాక్ మూవీతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చి వరుస మూవీలతో దూసుకెళ్తున్నాడు మాస్ మహారాజా. (Mass Maharaja) కోవిడ్ పాండమిక్ తర్వాత టాలీవుడ్‌లో వరుస సినిమాలతో (movies) జెట్‌ స్పీడ్‌ దూసుకెళ్తున్నాడు  రవితేజ. రమేశ్‌ వర్మ (Ramesh Verma) డైరెక్షన్‌లో ఖిలాడీ, న్యూ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో రామారావు.. ఆన్ డ్యూటీ (Rama Rao On duty) మూవీలో నటిస్తున్నాడు రవితేజ.

అలాగే త్రినాధరావు నక్కిన డైరెక్షన్‌లో ధమాకా (Dhamaka) మూవీలో,  వంశీతో టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswararao) చిత్రంలో నటించనున్నారు రవితేజ. ఇక ఈ సినిమాలన్నీ లైన్‌లో ఉండగానే.. సుధీర్ వర్మతో "రావణాసుర" (Ravanasura) అనే మరో మూవీ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశాడు మాస్‌ మహారాజ్. (Mass Maharaj)

రవితేజ హీరోగా నటించనున్న తాజా మూవీ "రావణాసుర". అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌ల‌పై అభిషేక్ నామా ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా (SrikanthVissa) స్టోరీ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ మూవీలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా, (Faria Abdullah) అలాగే ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్స్.

Also Read : Keerthy Suresh: నటి కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్

తాజాగా రవితేజ "రావణాసుర" మూవీకి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలో హీరో సుశాంత్ (Sushant) కీలక పాత్ర పోషించనున్నారు. పొడవాటి జుట్టు, గెడ్డంతో కొత్త గెటప్‌లో (New Getup) సుశాంత్ లుక్‌ అదిరిపోయింది. అయితే సుశాంత్  (Sushant) ఈ మూవీలో రామ్ పాత్రలో నటించనున్నాడు.

 

ఈ మూవీ జ‌న‌వ‌రి 14న (January 14) లాంఛనంగా ప్రారంభం కానుంది. రావణాసురలో రవితేజ.. (Ravi Teja) మొత్తం పది గెటప్స్‌లో కనిపించనున్నాడట. దీపా‌వళికి రిలీజైన ఈ మూవీ (Movie) టైటిల్.. ఫస్ట్ లుక్ (First look) పోస్టర్స్‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Also Read : Bangarraju Trailer : పండుగను ముందే తీసుకొచ్చిన బంగార్రాజు ట్రైలర్.. మామిడి తోటకు వెళ్దామా అంటోన్న కృతిశెట్టి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News