Surekha Vani Gets Trolled By YS Sharmila Fans: ఒకప్పుడు సినిమా నటీనటులు సాధారణ ప్రేక్షకులకు మధ్య చాలా దూరం ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఆ దూరాన్ని తగ్గించేసింది. సినీ నటీనటులు సినిమాల్లో బిజీగా ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో తమ అభిమానులకు మాత్రం అందుబాటులో ఉండాలని అనేక రకాల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.
అలాగే మరికొందరైతే తమ హాట్ ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కూడా కుర్రకాలలో క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో యాక్టివ్ గా ఉంటున్న సురేఖ వాణి, కొన్ని ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ తన అభిమానులను అల్లరించే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలను టార్గెట్ చేస్తూ ఒక ఫన్నీ రీల్ చేసింది.
Also Read: Rama Banam vs Ugram Collections: డిజాస్టర్ టాక్ తోనూ 'ఉగ్రం'ని తొక్కి దూసుకుపోతున్న రామబాణం
ఈ మధ్యకాలంలో మీడియాలో షర్మిల మాట్లాడుతున్న అన్ని మాటలు ట్రోలింగ్ కు గురవుతున్నాయి ఆమె మాటలను తీసుకుని చాలామంది రీల్స్ కూడా చేస్తున్నారు. అలాంటి ఒక డైలాగ్ తీసుకుని ఇప్పుడు సురేఖ వాణి కూడా రీల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. వైయస్ షర్మిల మాట్లాడిన వాటిలో పాదయాత్ర అంటే ఏమిటి పాదాలతో చేసే యాత్ర, స్టూడెంట్స్ అని ఎందుకంటారు చదువుకుంటున్నారు కాబట్టి, ఆడపిల్ల అని ఎందుకంటారు లాంటి మాటలు బాగా ట్రోలింగ్ కి గురయ్యాయి.
ఈ నేపథ్యంలో నేను స్టూడెంట్స్ ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళు యువత కాబట్టి అంటూ షర్మిల మాట్లాడిన మాటలను ట్రోల్ చేస్తూ ఆ తర్వాత డిజె టిల్లులోని సిద్దు జొన్నలగడ్డ వాయిస్ ని యాడ్ చేసిన రీల్ కి సురేఖ వాణి వీడియో చేసింది. నీకు దండం పెడతా నేను నువ్వు ఎంత తక్కువ కుదిరితే అంత మాట్లాడు రాధికా ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంటే ఒకరకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తోంది అంటూ సిద్దు చెప్పిన డైలాగ్ ను షర్మిల మాట్లాడడం ఆపేయమని అర్థం వచ్చేలా సురేఖ వాణి వీడియో చేసింది.
అయితే ఆమె కావాలని చేసిందో లేదో సరదాగా చేసిందో తెలియదు కానీ ఈ వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సురేఖా వాణి మీద అసభ్యకరమైన రీతిలో కామెంట్లు పెడుతూ వైఎస్ కుటుంబ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
Also Read: Samantha Reply to Nagachaitanya: మనని అవే దూరం చేశాయి.. నాగచైతన్యకి సమంత కౌంటర్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook