Video Viral: వావ్.. తన బెస్టీతో అక్కినేని కోడలు భలే డ్యాన్స్ చేసిందిగా.. వీడియో ఇదిగో..

Sobhita Dhulipala dance video: శోభిత ధూళిపాళ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.  ఇటీవల మేకప్ రూమ్ లో.. శోభిత మాస్ స్టెప్పుల వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వీడియో నెట్టింట సందడి చేస్తుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 12, 2024, 08:30 PM IST
  • భలే ఫన్నీగా డ్యాన్స్ చేస్తున్న శోభిత..
  • ఫిదా అవుతున్న నెటిజన్లు
Video Viral: వావ్.. తన బెస్టీతో అక్కినేని కోడలు భలే డ్యాన్స్ చేసిందిగా.. వీడియో ఇదిగో..

sobhita Dhulipala dance video: అక్కినేని చైతు, శోభితల పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది. డిసెంబరు 4న జరిగిన ఈ వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. అదే విధంగా.. శోభిత, చైతుల పెళ్లి వేడుక అన్న పూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిగింది. అయితే.. వీరి పెళ్లి వేడుక రాత్రి 8. 13 నిమిషాలకు జరిగింది. దాదాపు వీరి పెళ్లి క్రతువు 8 గంటల పాటు జరిగినట్లు తెలుస్తొంది. ముఖ్యంగా శోభిత ఎంగెజ్ మెంట్ తర్వాత అనేక రూమర్స్ వ్యాప్తి చెందించారు.

వీరి పెళ్లి జరగదని, నాగార్జున మరల ఆలోచిస్తున్నారని, వేణు స్వామి రచ్చ అంటూ రక రకాలుగా పుకార్లు క్రియేట్ చేసి వ్యాప్తి చేశారు. కానీ అవన్ని కూడా ఫెక్ అని తెలిపోయాయి. ఈ జంట పెళ్లి మాత్రం ఎట్టి ఆటంకాలు లేకుండా.. వివాహా బంధంతో ఒక్కటయ్యాయి. పెళ్లి తర్వత ఈ కుటుంబం శ్రీ శైలం మల్లీ కార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అంతేకాకుండా..ప్రత్యేకంగా మొక్కులు సైతం తీర్చుకున్నారు.

 

అయితే.. వీరికి ఆలయ పండితులు, పూజారులు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఆశీర్వాదం, ప్రసాదాలు అందించారు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కినేని కోడలు శోభిత పెళ్లి ఫోటోలతో పాటు.. డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే శోభిత మేకప్ రూమ్ లో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వీడియో వార్తలలో నిలిచింది.

ప్రస్తుతం తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో.. శోభిత తన బెస్టీ ఐశ్వర్య లక్ష్మితో కలిసి ఫన్నీగా డ్యాన్స్ లు చేసినట్లు తెలుస్తొంది. ఈ వీడియోలో ఫోన్ లో రికార్డు ఆప్షన్ ఆన్ చేసి.. దాని ముందు.. శోభిత, ఐశ్వర్య లక్ష్మి ఇద్దరు కలిసి ఫన్నీగా..ఫోజులు ఇస్తు రచ్చ రచ్చ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. నెటిజన్ లు మాత్రం అక్కినేని కోడలి ట్యాలెంట్ కు ఫిదా అవుతున్నారంట. అయితే.. ఈ వీడియో పాతదేనంట.. ప్రస్తుతం మరొసారి ట్రెండింగ్ గా మారినట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News