Tillu Square Day 1 Collections: ఈసారి బేస్ మరింత పెంచిన టిల్లు.. అదరగొట్టిన మొదటి రోజు కలెక్షన్స్..

Tillu Square: 2022లో విడుదలైన డిజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా వచ్చింది టిల్లు స్క్వేర్. మొదటి నుంచి భారీ అంచనాలు తెచ్చుకున్న ఈ చిత్రం విడుదలయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2024, 10:55 AM IST
Tillu Square Day 1 Collections: ఈసారి బేస్ మరింత పెంచిన టిల్లు.. అదరగొట్టిన మొదటి రోజు కలెక్షన్స్..

Tillu Square Collections:
సిద్దు జొన్నలగడ్డ హీరోగా డీజే టిల్లు సూపర్ హిట్ సినిమాకి సీక్వెర్ గా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్. మార్చ్ 29న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమా ఆధ్యాంతం వినోదాత్మకంగా సాగడంతో.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకుపోతోంది

ఈ సినిమాని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ చిత్రానికి సాంగ్స్ అందించగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ ఇచ్చారు. ప్రిన్స్, మురళిధర్ తదితరులు నటించారు. కాగా డిజే టిల్లు చిత్రం సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిన.. టిల్లు స్క్వేర్ లో సెకండ్ హాఫ్ కూడా బోర్ కొట్టలేదని.. మొత్తానికి ఈ చిత్రం పర్ఫెక్ట్ సీక్వెల్ అని నేటిజన్స్ అందరు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ చిత్రం మొదటి రోజే కలెక్షన్స్ బీభత్సంగా తెచ్చుకునింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ చిత్రం సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, నైజాంలో రూ. 8.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 11.00 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తం పైన ఈ సినిమా తెలుగులో రూ. 22.00 కోట్లకు అమ్ముడుపోగా ఓవర్సీస్ లో రూపాయలు మూడు కోట్లు..అలానే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు,  కలిపి మొత్తంగా దీనికి రూ. 27 కోట్లు బిజినెస్ అయింది.

కాగా మొదటి రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.00 కోట్లు వరకూ షేర్ వసూలు అయింది అని తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలిపి రూ. 10 కోట్లు వరకూ రాబట్టింది. అంతేకాదు, మొదటి రోజే రూ. 23.7 కోట్లు గ్రాస్ రాబట్టి ఈ సంవత్సరం 2వ అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూవీగా రికార్డు కొట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ ఒక కొత్త పోస్టర్ తో ప్రేక్షకులకు తెలియజేశారు.

ఇక వచ్చే శుక్రవారం వరకు ఏ కొత్త సినిమా విడుదల లేకపోవడంతో ఈ చిత్రం కలెక్షన్స్ ఈ వీకెండ్ దుమ్ముదులపచ్చని.. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందని సినీ ప్రేక్షకులు విశ్లేషిస్తున్నారు.

Also Read: Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక

Also Read: KTR Fire: కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్‌

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News