నటీనటులు: అశ్విన్ బాబు, దిగంగాన సూర్యవంశీ, అర్భాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజి, తులసి, అయ్యప్ప శర్మ,తనికెళ్ల భరణి, షకలక శంకర్, కాశీ విశ్వనాథ్ తదితరులు
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
సంగీతం: అనిరుథ్ రవిచంద్రన్
నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి
దర్శకత్వం: అప్సర్
అశ్విన్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘శివం భజే’. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను తగ్గట్టు ఈ సినిమా మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
చైనా, పాకిస్థాన్ కలిసి మన దేశంపై మరో కుట్రకు తెర లేపుతారు. కరోనా మాదిరి ఓ డేంజరస్ వ్యాక్సిన్ ను మన దేశంలోని ప్రజలపై ప్రయోగించాలని పన్నాగం పన్నుతారు. ఈ రకంగా దేశంలో అల్లకల్లోలం సృష్టించి మన ప్రభుత్వం, మిలటరీ దృష్టి మళ్లించి.. మన దేశంపై దండయాత్ర చేయాలనుకుంటారు. వారి పన్నాగాన్ని లోన్ రికవరీ ఏజెంట్ అయిన శేఖర్ (అశ్విన్ బాబు) ఎలా అడ్డుకున్నాడు. అతనికి ఓ యాక్సిడెంట్ లో కళ్లు పోతాయి. ఈ క్రమంలో అతనికీ వేరే వాళ్ల కళ్లు పెడతారు. ఆ కళ్ల ద్వారానే దేశ ద్రోహుల పన్నాగాన్ని ఎలా చేధించాడు. దానికి దైవ శక్తి ఎలా సహకారం అందించింది అనేదే ‘శివం భజే’ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెలుగులో ఈ మధ్య డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా స్టోరీ కూడా గతంలో నరేష్ హీరోగా గీత కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కోకిల’ సినిమాను పూర్తిగా కాకున్న అక్కడక్కడ గుర్తుకు తెస్తుంది. కానీ ‘శివం భజే’ సినిమా స్టోరీగా మన శతృ దేశాలపై చైనా, పాకిస్థాన్ కలిసి ఎలా మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర పన్నుతాయనే కాన్సెప్ట్ కామన్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చేసాడు. సినిమా స్టార్టింగ్ లో ఈ సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు దర్శకుడు. తొలి సగంలో హీరో లోన్ రకవరీ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ ను కలుస్తాడు. ఆ తర్వాత మధ్యలో లవ్ ట్రాక్ అంతా రొటీన్ గా ఉంటుంది. ఈ క్రమంలో హీరోయిన్ ఓ ల్యాబ్ లో శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉంటుంది. ఓ పెద్ద సైంటిస్ట్ అయివుండి.. ఓ లోన్ రికవరీ ఏజెంట్ ను ఎలా ప్రేమిస్తుందనే కాన్సెప్ట్ ను లాజిక్ కు అందదు. సినిమా కాబట్టి సర్దుకుపోవాలి. దర్శకుడు అప్సర్ కొత్త దర్శకుడు అయిన.. ఓ సీనియర్ దర్శకుడి మాదిరి ఈ సినిమా ను డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఏదో రొటీన్ సబ్జెక్ట్ కాకుండా.. తొలి సినిమాతోనే చైనా, పాకిస్థాన్, భారత్ వంటి సీరియస్ సబ్జెక్ట్ తీసుకోవడం సబ్జెక్ట్ పై అతని ఆత్మ విశ్వాసం చెబుతుంది.
దర్శకుడు తను ఎంచుకున్న పాయింట్ బాగానే ..దాన్ని ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఎక్స్ క్యూట్ చేసాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండాఫ్ ఏమవుతుందో అనే క్యూరియోసిటీ ఆడియన్స్ లో పెంచాడు. ఓ యాక్సిడెంట్ లో హీరో కళ్లు పోవడంతో.. అతని వేరే వాళ్ల కళ్లు పెడతారు. ఆ తర్వాత ఎవరి కళ్లు అయితే... శేఖర్ కు పెడతారో అతని జ్ఞాపకాలు ఇతన్ని వెంటాడుతాయి. ఈ క్రమంలో చనిపోయిన ఆ వ్యక్తి ఎవరు.. ? అతని ద్వారా చైనా, పాకిస్థాన్ ఆగడాలను శేఖర్ ఎలా అరికట్టాడు. శతృ దేశపు పన్నాగాలను అరికట్టడంలో శేఖర్ కు దైవ భక్తి ఎలా తోడైందనేది కామన్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. క్లైమాక్స్ ను ఇంకాస్త బెటర్ గా చేసుంటే బాగుండేది. ఓవరాల్ గా ఇపుడొచ్చే రొటీన్ లవ్ స్టోరీలతో పోలిస్తే.. ఈ సినిమా ఎన్నో రెట్లు మేలు. మొత్తంగా దేశ భక్తికి దైవ భక్తి జోడించి తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయోచ్చు. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫోటోగ్రఫీ బాగుంది. ఆర్ఆర్ బాగుంది. కొన్ని సీన్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
నటీనటుల విషయానికొస్తే..
హీరోగా నటించిన అశ్విన్ బాబు..తన పాత్రలో ఈజ్ చూపించాడు. తన యాక్టింగ్ తో పర్వాలేదనపించాడు. ఇక హీరోయిన్ గా నటించిన దిగాంగన సూర్యవంశీ తన పరిధి మేరకు బాగానే చేసింది. హైపర్ ఆది ఈ సినిమాలో తన జబర్ధస్త్ పంచ్ లను బాగానే వాడాడు. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై అర్భాజ్ ఖాన్ ఎంట్రీ బాగుంది. ఏసీపీగా అతని నటన ఆకట్టుకునేలా ఉంది. మురళీ శర్మ, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి ఉన్నంతలో పర్వాలేదనిపించారు.
ప్లస్ పాయింట్స్
కథ
ఇంటర్వెల్ బ్యాంగ్
ఆర్ఆర్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
లాజిక్ లేని సీన్స్
హడావుడి క్లైమాక్స్
చివరి మాట.ఓ మోస్తరుగా ఆకట్టుకునే ‘శివం భజే’..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter