Shah Rukh Khan viral video: మీడియా నుంచి తప్పించుకునేందుకు SRK పాట్లు.. వీడియో వైరల్

Shah Rukh Khan hides under umbrella, video goes viral: తన కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో (Aryan Khan drugs case) చిక్కుకుని విచారణ ఎదుర్కొంటుండటంతో మీడియా ముందుకు వచ్చేందుకు షారుఖ్ జంకుతున్నారా ? అంటే సోషల్ మీడియాలో అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2021, 06:55 PM IST
Shah Rukh Khan viral video: మీడియా నుంచి తప్పించుకునేందుకు SRK పాట్లు.. వీడియో వైరల్

Shah Rukh Khan hides under umbrella, video goes viral: షారుఖ్ ఖాన్ మీడియా కెమెరాల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారా ? తన కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో (Aryan Khan drugs case) చిక్కుకుని విచారణ ఎదుర్కొంటుండటంతో మీడియా ముందుకు వచ్చేందుకు షారుఖ్ జంకుతున్నారా ? అంటే సోషల్ మీడియాలో అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. నవంబర్ 7, ఆదివారం నాడు ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన షారుఖ్.. అక్కడున్న మీడియా కెమెరాల కంటికి చిక్కకుండా దాక్కొని మరీ కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోవడమే సోషల్ మీడియాలో ఈ ప్రచారానికి కారణమైంది. 

అవును.. ఆదివారం ప్రైవేటు జెట్ (Shah Rukh Khan's private jet) ద్వారా ముంబైలోని ప్రైవేటు కలినా ఎయిర్ పోర్టుకు వచ్చిన షారుఖ్, సీక్రెట్‌గా గొడుగు చాటుకు దాచుకుని కారు ఎక్కిన వైనం సోషల్ మీడియాలో చర్చనియాంశమైంది. ఏంటి ఇంకా అర్థంకాలేదా ? అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

ఈ వైరల్ వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. షారుఖ్ ఖాన్ బాడీగార్డు కారు డోర్ వద్ద నిలబడి ఉండగా.. మరొకతను షారుఖ్‌కి గొడుగుపడుతూ కారు వద్దకు తీసుకెళ్లినట్టు కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ (SRK viral video) సైతం గొడుగు కింద తలదాచుకుంటూ వంగి వంగి కారు వద్దకు వెళ్లడం వీడియోలో గమనించవచ్చు. 

ఎప్పటికప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు, సినిమా వార్తలపై ఎక్స్‌క్లూజివ్ కవరేజ్ అందించే ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని (Famous Bollywood Photographer Viral Bhayani) షారుఖ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

Trending News