Sankranthiki Vasthunnam box office collections : ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో మూడు ప్రాముఖ్యమైన సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ముందుగా విడుదలైన రామ్ చరణ్ చిత్రం గేమ్ చేంజర్ కేవలం పరవాలేదు అనిపించుకుంది. తర్వాత విడుదలైన బాలకృష్ణ డాకు మహారాజ్.. మంచి విజయం నమోదు చేసుకుంది. అయితే ఈ రెండు సినిమాలకు మించి.. చివరిగా జనవరి 14న విడుదలైన వెంకటేష్
సంక్రాంతికి వస్తున్నాం.. ఏకంగా రికార్డులను బ్రేక్ చేస్తుంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా కేవలం ఏరు రోజుల్లోనే.. దాదాపు రూ.203 కోట్ల వసూళ్లు సాధించి, టాలీవుడ్‌లో ఒక మంచి బాక్సాఫీస్ రికార్డు నెలకొల్పింది.సినిమా, ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి, వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది.
ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాలలో.. అంతే కాదు ఏడవ రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో.. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండో స్థానంలో నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి స్థానంలో త్రిబుల్‌ఆర్ నిరువక.. రెండో స్థానంలో సంక్రాంతి వస్తున్నాం నిలిచింది.
కాగా ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. సాయికుమార్ , మురళీధర్, వీకే నరేష్, వీటీవీ గణేష్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ చిత్రానికి.. దాదాపు 80 కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు దిల్‌రాజు. అయితే ఈ సినిమా ఈ నిర్మాతకి ఎన్నో లాభాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.
ఈ సినిమాకి 42 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. అందులో ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, మిగతా రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అందువల్ల ఈ చిత్రం కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. కానీ ఈ బ్రేక్ ఇవన్నీ ఏకంగా మూడు రోజుల్లోనే కొట్టి పడేసింది సంక్రాంతికి వస్తున్నాం. ఇక ప్రస్తుతం ఈ చిత్రం అందరికీ లాభాలు తెచ్చిపెట్టదంలో బిజీగా ఉంది. మరి ఈ చిత్రం జోరు ఇలానే కొనసాగితే.. మరిన్ని రికార్డులు కొల్లగొట్టేలా కనిపిస్తోంది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.