Samantha calls 2021 rough after split with Naga Chaitanya : 2021వ సంవత్సరం తన జీవితంలో ఎంతో కష్టంగా సాగిందని హీరోయిన్ సమంత అన్నారు. బాలీవుడ్ స్టార్ట్స్ (Bollywood Starts), సౌత్ స్టార్స్‌తో ఇటీవల ఓ ఛానల్ నిర్వహించిన ఇంటర్వూలో సమంత కూడా పాల్గొన్నారు. తాప్సీ, విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్రతో పాటు హీరోయిన్ సమంత ఈ చిట్‌చాట్‌లో తన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. అయితే ఇందుకు సంబంధించి ఓ స్పెషల్ ప్రోమో తాజాగా విడుదలైంది.
ఇందులో 2021 సంవత్సరం ఎలా గడిచిందో ఒక్క మాటలో చెప్పాలని కోరగా ఇంటర్వ్యూలో పాల్గొన్న తారలంతా భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇక సమంత మాత్రం తన లైఫ్‌లో 2021 ఒక రఫ్ (2021 rough) అని పేర్కొంది. 2021 చాలా క్లిష్టమైన ఏడాదిగా సమంత చెప్పుకొచ్చింది. ఇప్పుడు సమంత ఈ మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సమంత నువ్వు స్ట్రాంగ్‌గా ఉండమంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read : Palmistry: మీ చేతి రేఖలు ఇలా ఉన్నాయా..?? అయితే మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారని అర్థం!
అయితే సమంత (Samantha) తన వ్యక్తిగత జీవితంలో ఈ ఏడాది ఓ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య, సమంత వైవాహిక బంధానికి (marital bond) బ్రేక్ పడ్డది కూడా ఈ ఏడాదే. పరస్పర అంగీకారంతోనే వీరిద్దరూ విడిపోతున్నట్లు అక్టోబర్ 2న ప్రకటించారు.
ఇక సామ్ (Sam) కెరీర్‌పై దృష్టి సారించారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. త్వరలో సామ్ హాలీవుడ్లో కూడా తళుక్కున మెరవనున్న విషయం తెలిసిందే. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ తెరకెక్కించనున్న ఇంగ్లిష్ ఫీచర్ ఫిల్మ్ అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్ మూవీలో సామ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇందులో సామ్ బై సెక్సువల్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : Chilli potato making video: చిల్లి పొటాటో చేయడంలో ఎవరైనా ఈ బుడ్డోడి తర్వాతేనట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి