Salaar - Prabhas: సలార్ 2 షూటింగ్ పై క్రేజీ అప్‌డేట్.. రిలీజ్ డేట్ అపుడేనా.. ?

Prabhas - Salaar: రీసెంట్‌గా సలార్ మూవీతో పలకరించిన ప్రభాస్.. త్వరలోనే 'కల్కి 2898 AD' మూవీతో పాటు 'రాజా సాబ్' మూవీలతో పలకరించనున్నారు. దాంతో పాటు సందీప్ రెడ్డి వంగా సినిమాతో పాటు సలార్ 2 మూవీ ఉంది. ఐతే సలార్ 2 మూవీ ఎపుడు ప్రారంభిస్తారు. ఎపుడు విడుదల చేస్తారనేది ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. తాజాగా ఈ మూవీ ఎపుడు ప్రారంభించేది ఈ చిత్ర నిర్మాత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 29, 2024, 06:11 PM IST
Salaar - Prabhas: సలార్ 2 షూటింగ్ పై క్రేజీ అప్‌డేట్.. రిలీజ్ డేట్ అపుడేనా.. ?

Prabhas - Salaar:బాహుబలి సినిమాతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని రెబల్ స్టార్.. రీసెంట్‌గా విడుదలైన 'సలార్' మూవీతో మళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. ఇప్పటికే ఓటీటీలో విడుదలైన మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మరో లీడ్ రోల్లో నటించారు. లాస్ట్ ఇయర్ చివర్లో విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచే మంచి టాక్‌తో బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. ఇక కన్నడ,ఇతర భాషల్లో పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయింది. అటు హిందీలో కూడా అనుకున్నంత టాక్‌కు తగ్గ వసూళ్లు రాబట్టడంలో విఫలం అయింది. దీంతో ఈ సినిమా పరుగు రూ. 700 కోట్ల వరకే పరిమితమైంది.

సలార్ స్టోరీ విషయానికొస్తే.. ఇద్దరు ప్రాణ స్నేహితులు..శత్రువులుగా ఎలా మారారనే కథాంశంతో తెరకెక్కింది. ఇక సలార్ రెండో పార్ట్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. రెండో పార్ట్‌కు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనే టైటిల్ ఖరారు చేసారు మేకర్స్. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ ఈ యేడాది సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ వచ్చే 2025 దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్.  ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. మరోవైపు 'సలార్' మూవీ స్పానిష్ భాషలో డబ్ చేసిన మార్చి 7 లాటిన్ అమెరికా దేశాల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు 'సలార్' మూవీని జపాన్‌ దేశంలో సమ్మర్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇక సలార్ మూవీ నైజాం (తెలంగాణ) గడ్డపై రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది. గతంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత మూడో సినిమాగా ఈ మూవీ రికార్డులకు ఎక్కింది. తెలుగులో సంక్రాంతి సినిమాల రాకతో ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. మరోవైపు ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈ మూవీ హిందీ వెర్షన్ కలెక్షన్స్ విషయానికొస్తే.. షారుఖ్ హీరోగా నటించిన 'డంకీ' సినిమాతో పోటీ కారణంగా తక్కువ స్క్రీన్స్ దక్కాయి. అయినా.. అక్కడ కూడా మంచి వసూళ్లనే సాధించింది. అక్కడ ఈ మూవీ ఓవరాల్‌గా రూ. 150 కోట్ల నెట్ వసూళ్లతో దుమ్ము దులిపింది. ఓవరాల్‌గా రూ. 153.45 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్టు సమాచారం.

మొత్తంగా సినిమా హిందీలో రూ. 75 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. టోటల్ రన్ ముగిసే సమయానికి హిందీలో రూ. 76.50 కోట్ల రేంజ్‌లో షేర్ సొంతం చేసుకొని హిందీలో హిట్ స్టేటస్ అందుకుంది. ఇక రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 78 కోట్ల బిజినెస్‌కు రన్ కంప్లీట్ అయ్యేవరకు రూ. 80.90 కోట్ల రేంజ్‌ను చేసుకొని సొంతం చేసుకొని పరుగును పూర్తి చేసుకుంది. ఓవరాల్‌గా ఈ మూవీ హిందీ సహా రెస్ట్ ఆఫ్ భారత్‌లో హిట్ అందుకుంది.

Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్‌ లేదబ్బా

Also Read: Bottole Thrash: 'బాటిల్‌' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News