Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన.. కీలక ప్రకటన చేసిన బాంద్రా పోలీసులు..

Saif ali khan murder case: సైఫ్ అలీఖాన్ కేసులో తాజాగా బాంద్రా పోలీసులు కీలక ప్రకటన జారీ చేశారు. ఈ ఘటనకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వార్తల్లో నిజంలేదన్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 17, 2025, 04:11 PM IST
  • సైఫ్ కేసులో మరో ట్విస్ట్..
  • అసలు విషయం బైటపెట్టిన బాంద్రా పోలీసులు
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన.. కీలక ప్రకటన చేసిన బాంద్రా పోలీసులు..

Bandra police on saif ali khan murder case: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ముంబైలోని బాంద్రాలో నిన్న హత్యయత్నం జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం బాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ ఘటనలో బాంద్రా పోలీసులు కీలక ప్రకటన చేశారు. పలు మీడియాల్లో ఉదయం నుంచి ఈ కేసుకు సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయని.. ఇది పూర్తిగా అవాస్తవమన్నారు.

అదుపులోకి తీసుకున్న వ్యక్తికి సైఫ్ కేసుతో సంబంధం లేదన్నారు. అంతే కాకుండా.. ఈ కేసులో 20 బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన వారిని తొందరలోనే పట్టుకుంటామన్నారు. బాంద్రా రైల్వే స్టేషన్ లో నిందితుడ్ని చివరిసారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. బాంద్రాలోని సైఫ్ నివాసంలో..  దుండగులు రాత్రి పూట ఆయన ఇంటికి ప్రవేశించి.. ఆయన బిడ్డ ఉన్న రూమ్ లోకి ప్రవేశించారు.

ఈ క్రమంలో ఒక మహిళతో పెనుగులాట జరిగింది. అంతే కాకుండా.. అలికిడితో..సైఫ్ బైటకు వచ్చాడు. దీంతో దుండగులు కత్తితో సైఫ్ మెడ మీద, చేతుల మీద పొడిచాడు. అరుపులతో సైఫ్ కొడుకు అక్కడకు వచ్చాడు. వెంటనే నిందితుడు పారిపోయాడు.

Read more: Daaku Maharaaj: డాకు మహారాజ్ అభిమానులకు బిగ్ షాక్.. ఐదుగురు అరెస్ట్.. మ్యాటర్ ఏంటంటే..?

తీవ్ర గాయాలపాలైన ఆయన్ను.. సైఫ్ కుమారుడు ఆటోలో లీలావతి ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు ఇప్పటి వరకు రెండు సర్జరీలు అయ్యాయి. వెన్నుపాములో ఉన్న కత్తిని వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి సైఫ్ బైటపడ్డారు.  ఈ కేసులో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ను దర్యాప్తు అధికారిగా నియమించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News