Rx 100 Fame Ajay Bhupathi Mangalavaram Announced: సినీ పరిశ్రమలో ఒక్కొక్కరికి ఓవర్ నైట్ సక్సెస్ లభిస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న ఒక్క సినిమా వారి జీవితాన్ని మార్చేస్తుంది. కానీ ఒక్కొక్కరికి మాత్రమే మొదటి సినిమా సూపర్ సక్సెస్ తెచ్చి పెడుతుంది. అలాంటి వారిలో అజయ్ భూపతి ఒకరు అజయ్ భూపతి అనగానే అందరికీ గుర్తు రాకపోవచ్చు. కానీ ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అంటే మాత్రం తెలుగు ఆడియన్స్ అందరికీ అర్థమవుతుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో 2018 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజయ్ భూపతి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అప్పటి వరకు తెలుగు సినిమాని ఈ విధంగా కూడా తీయవచ్చా అని ఆలోచింపజేసే విధంగా ఒక బోల్డ్ అటెంప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఆ సినిమాని తెలుగు ఆడియన్స్ సూపర్ హిట్ చేయడంతో ఇక అజయ్ భూపతికి తెలుగు సినీ పరిశ్రమలో తిరుగు ఉండదు అనుకున్నారు. అదే విధంగా హీరో హీరోయిన్లు కూడా దూసుకుపోతారనే అనుకున్నారు. కానీ దురదృష్టమో కాకతాళీయమో తెలియదు కానీ అటు హీరో హీరోయిన్లకు కానీ అజయ్ భూపతికి గానీ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాల్లేవు. హీరో కార్తికేయ కొంతవరకు ఏవో సినిమాలు చేస్తున్నా అనిపిస్తున్నాడు కానీ పాయల్ రాజ్ పుత్ పరిస్థితి మరి దారుణంగా తయారయింది. ఆమె పెళ్లి చేసుకుని వేరే భాషల్లో సైతం నటించడానికి సిద్ధమైపోయింది, ఇక అజయ్ భూపతి పరిస్థితి మాత్రం వర్ణనాతీతం.
ఆయన చేసిన మహాసముద్రం అనే ప్రాజెక్టు దెబ్బవేసింది. చాలా కాలం పాటు దాని మీద స్టడీ చేసి మరీ తీసినా ఎందుకో ఫెయిల్ అయింది. ఇక ఎట్టకేలకు ఆయనకు నిర్మాతలు కూడా దొరకని నేపథ్యంలో స్వయంగా నిర్మాత అవతారం ఎత్తి ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. స్వీయ దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ అయితే ఈ రోజు వచ్చేసింది. మంగళవారం పేరుతో ఈ సినిమా రూపొందుతోంది, ముద్ర మీడియా బ్యానర్ మీద స్వాతి గునుపాటి, సురేష్ వర్మ ఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద అజయ్ భూపతి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని సౌత్ ఇండియన్ మూవీ అని చెబుతూ ప్రమోట్ చేస్తున్నారు.
అంటే హిందీ మినహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ చేసిన సమయంలో అజయ్ భూపతి మాట్లాడుతూ ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అని ఇప్పటి వరకు మన దేశంలో ఎవరూ ఇలాంటి కాన్సెప్ట్ తో ఇలాంటి జానర్ తో సినిమా చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే మంగళవారం అనే టైటిల్ కాస్త ఎబ్బెట్టుగా ఉందని అడిగితే దీనికి టైటిల్ ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది అంటూ సమాధానం ఇచ్చారు. సినిమాలో 30 పాత్రలు ఉంటాయని ప్రతిపాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మంగళవారం సినిమాని మంగళవారం రోజునే అనౌన్స్ చేయడం మరో ఆసక్తికర అంశం ఈ సినిమాకి కాంతారావు సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Genelia D'souza Kids Doing Namaste: ఇదే కదా సంస్కారం అంటే.. ఫోటోగ్రాఫర్లకు జెనీలియా పిల్లలు నమస్కారం!
Also Read: Naga Shaurya Fight: లవర్ ను రోడ్డుపై కొట్టిన యువకుడు.. రచ్చ చేసిన నాగశౌర్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి