"లక్షీస్ వీరగ్రంథం" హీరోయిన్ గా ' రాయ్‌లక్ష్మి'

Last Updated : Nov 14, 2017, 12:44 PM IST
"లక్షీస్ వీరగ్రంథం" హీరోయిన్ గా ' రాయ్‌లక్ష్మి'

" లక్ష్మీస్ ఎన్టీఆర్ " పోటీగా వస్తున్న లక్షీస్ వీరగ్రంథం సినిమా షూటింగ్కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. ఖైదీ నెంబర్ 150, కాటమరాయుడు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్లో చిందులేసిన రాయ్‌లక్ష్మిని.. లక్ష్మీ పార్వతి పాత్ర కోసం ఎంపిక చేసినట్లు టాక్.

"లక్షీస్ వీరగ్రంథం" అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచే వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవలే ఎన్టీఆర్ ఘాట్ వద్ద తొలి షాట్ కోసం ప్రయత్నించగా  అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పాత్రను నెగిటివ్‌గా తీస్తున్నట్లు టాక్ వచ్చింది.

లక్ష్మీ పార్వతి అభ్యంతరం..

 "లక్షీస్ వీరగ్రంథం" సినిమాను లక్ష్మీ పార్వతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  తనను సంప్రదించకుండా తను జీవిత చరిత్రను ఎలా చిత్రీకరిస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాకు తన అనుమతి లేదని.. తన పర్మిషన్ లేకుండా సినిమా తీస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె.. దర్శకుడు కేతిరెడ్డిని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్పెష్ ల్ సాంగ్స్‌లో చిందులేసిన రాయ్ లక్ష్మిని ఎంపిక చేయడంతో ఈ చిత్రం మరింత వివాదాస్పదంగా మారింది.  అయితే హీరోయిన్ విషయాన్ని దర్శకుడు కేతిరెడ్డి మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

Trending News